Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బన్నీ వాసు సొంత నిర్మాణంలో మొదలుపెట్టిన ‘ఇడుపు కాయితం’ సినిమా ఇప్పుడు ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో ప్రియదర్శి హీరోగా, ఫోక్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్గా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ‘ఇడుపు కాయితం’ అనే పేరు కొంచెం కొత్తగా అనిపించడంతో, అసలు ఈ పదానికి అర్థం ఏమిటి అనే చర్చ మొదలైంది. ఈ పదం తెలంగాణ పదజాలంలోనే ఉంది; కానీ, తెలంగాణలో కూడా కొంతమందికి అర్థం కాని విధంగా ఈ పదం ఉందనే చర్చ నడుస్తోంది.
దానికి తోడు, సోషల్ మీడియాలో ఎవరో ఆకతాయి “దీన్ని ఆంధ్ర భాషలోకి డబ్బింగ్ చేస్తారా?” అని ప్రశ్నించడంతో పెద్ద ఎత్తున వివాదం మొదలైంది. తెలంగాణ పదజాలం అంటే ఆంధ్ర వారికి చులకన అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. అయితే, దానికి కొంతమంది ఆంధ్ర వాళ్ళు స్పందిస్తూ… “నోటి దురద కొద్దీ అలా మాట్లాడిన కొంతమంది ఆంధ్ర వాళ్ళను మాత్రమే అనండి, అందరి ఆంధ్ర వాళ్ళను కలిపి అనాల్సిన అవసరం లేదు” అని అంటున్నారు.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
అయితే, ఇంత వివాదానికి కారణమైన ఈ ‘ఇడుపు కాయితం’ అనే పదానికి అర్థం నిర్దిష్టంగా లేకపోయినా… విడాకులు తీసుకుంటున్నట్లుగా పెద్దల సమక్షంలో రాసుకున్న ఒక ఒప్పంద పత్రం అని చూచాయిగా చెప్పొచ్చు. చాలా తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ కోర్టుల ద్వారా పూర్తిస్థాయిలో విడాకులు జరగవు; కానీ, పెద్దల సమక్షంలో రాసుకున్న ‘ఇడుపు కాయితాలే’ వారికి విడాకుల పత్రాలుగా చలామణి అవుతూ ఉంటాయని తెలుస్తోంది. మొత్తంగా, ‘ఇడుపు కాయితం’ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టకముందే సోషల్ మీడియాలో పెను చర్చకు దారి తీసిందని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!