Site icon NTV Telugu

Priyadarshi : నాని దారిలో వెళ్తున్న ప్రియదర్శి.. సక్సెస్ అవుతాడా..?

Priyadarshi

Priyadarshi

Priyadarshi : నేచురల్ స్టార్ నానిని యంగ్ హీరో ప్రియదర్శి ఫాలో అవుతున్నాడు. కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన ప్రియదర్శి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడు. అయితే ఆయన ఎంచుకుంటున్న కథలు, చేస్తున్న సినిమాలను చూస్తుంటే నాని దారిలోనే వెళ్తున్నాడని అనిపిస్తోంది. మొదట్లో నాని చేసిన సినిమాలు అందరికీ గుర్తుంది. ఎక్కువగా కామెడీ ట్రాక్ ఉన్న సినిమాలే చేశాడు. కథతో పాటు కామెడీని మిక్స్ చేసి హిట్లు కొట్టాడు. నాని మొదట్లో మాస్ సినిమాలు చేయలేదు. క్లాస్ సినిమాలు, ఎమోషనల్ సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఆయన చేసిన సినిమాల్లో కచ్చితంగా కంటెంట్ ఉండేలా చూసుకున్నాడు.
Read Also : Minister TG Bharat: కూటమిలో చిన్న, చిన్న విభేదాలు సహజం.. వాటి గురించే వివాదం..!

ఇప్పుడు ప్రియదర్శి కూడా అంతే. చేస్తున్న ప్రతి సినిమాలో కంటెంట్ ఉండేలా చేస్తున్నాడు. కథతో పాటు కామెడీని జోడించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. బలగం, జాతిరత్నాలు, కోర్టు సినిమాలే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న సారంగపాణి జాతకం సినిమా కూడా పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ జానర్ లో వస్తోంది. మనుషులకు ఉండే చిన్న చిన్న నమ్మకాలు, లోపాలను బేస్ చేసుకుని కామెడీ ట్రాక్ లో సినిమాలు చేస్తూ హిట్లు అందుకుంటున్నాడు ప్రియదర్శి. ఇలాంటి సినిమాల ద్వారా మిడిల్ క్లాస్ వాళ్లకు బాగా కనెక్ట్ అవుతారు. ఒకప్పుడు నాని ఇలాంటి సినిమాలు చేసి బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రియదర్శి కూడా ఇలాంటి దారిలోనే వెళ్తూ.. సక్సెస్ ఫుల్ హీరోగా ఎదగాలని చూస్తున్నాడు. ప్రియదర్శి సినిమాలు అంటే ఇప్పటికే ఓ బ్రాండ్ క్రియేట్ అయింది. మంచి సినిమాలే చేస్తాడు అనే నమ్మకం ప్రేక్షకుల్లో పెరుగుతోంది. మరి నాని లాగా హీరోగా సక్సెస్ అవుతాడా లేదా చూడాలి.

Exit mobile version