Site icon NTV Telugu

Priyadarshi: పల్లెటూరు పాట మన ఊరిని గుర్తు చేసేలా ఉంది…

Balagam

Balagam

కమెడియన్ టర్న్డ్ హీరో ప్రియదర్శి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బలగం’. వేణు టిల్లు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బలగం సినిమా నుంచి ‘ఊరు పల్లెటూరు’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది, ఈ పాట వింటే వేణు టిల్లుకి ఇంతమంచి టెస్ట్ ఉందా అనిపించకమానదు. పల్లెటూరు గురించి చెప్తూ కంపోజ్ చేసిన సాంగ్, వినగానే అట్రాక్ట్ చేసేలా ఉంది. మంచి ఫామ్ లో ఉన్న భీమ్స్, మరోసారి ఒక సోల్ ఉన్న ట్యూన్ ని కంపోజ్ చేశాడు. ఈ మధ్య తెలంగాణా యాసలో ఉండే పాట అనగానే గుర్తొస్తున్నా కాసర్ల శ్యామ్, మరోసారి తన కాలం నుంచి మంచి పదాలని ఒక చోట చేర్చి పాటగా మార్చాడు. మంగ్లీ, రామ్ మిర్యాలా గొంతులు ‘ఊరు పల్లెటూరు’ పాటకి ప్రాణం పోశాయి.

Read Also: Siddu Jonnalagadda Birthday: డీజే టిల్లూ… సిద్ధూ తీరే వేరు!

Exit mobile version