NTV Telugu Site icon

Prithviraj Sukumaran: సలార్ లో హింస లేదంట.. వరద ఏమన్నాడంటే.. ?

Salaar

Salaar

Prithviraj Sukumaran: సలార్ థియేటర్లలో దుమ్ములేపుతోంది. రిలీజ్ అయ్యి నాలుగు రోజులైనా ఎక్కడా క్రేజ్ తగ్గలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆరేళ్ళ నిరీక్షణకు ఫలితం దక్కింది. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ తో దుమ్మురేపుతోంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. సలార్ లో ప్రభాస్ కు ఎంత పేరు వచ్చిందో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు కూడా అంతే పేరు వచ్చింది. దేవా లేనిదే వరద లేడు.. వరద లేనిదే దేవా లేడు అనేలా ఇద్దరు స్నేహితులు కలిసి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాపై విమర్శలు తలెత్తుతున్న విషయం తెల్సిందే. దారుణమైన హింస, క్రూరత్వం, నరకుడు, రక్తం ఇవే ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ సినిమా నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదని విమర్శిస్తున్నారు. ఇక ఈ విమర్శలపై పృథ్వీరాజ్ స్పందించాడు.

ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ” నేను కేవలం నటుడును మాత్రమే కాదు.. ద‌ర్శ‌కుడిని కూడా. ఒక క‌థ‌లో పాత్ర‌కు అనుగుణంగా హింస‌..ర‌క్త‌పాతం ఉంటే గ్రాఫిక్స్ ద్వారా ద‌ర్శ‌కుడు దాన్ని చూపిస్తాడు. దర్శకుడిగా అతనికి ఆర‌క‌మైన స్వేచ్ఛ ఉంటుంది. ద‌ర్శ‌కుడు చెప్పింది న‌టుడు చేయాల్సిందే. చివ‌రిగా మేమంతా ఓ చిత్రాన్ని త‌యారు చేసి సినిమాలో ఏది ఉండాలి.. ఏది ఉండకూడదు అని నియంత్రించే సెన్సార్ బోర్డ్ ముందుకు తీసుకెళ్తాం.. వాళ్లు మా సినిమా చూసి ఎలా ఉందో నిర్దారించుకుని ఓ స‌ర్టిఫికెట్ అందిస్తారు. ఫ‌లానా వ‌ర్గాలు వారు మాత్ర‌మే చూడాల‌ని అందులో చెబుతారు. మా బాధ్య‌త మేము అనుకున్న కథను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ల‌డం వ‌ర‌కే. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి హాలీవుడ్ సినిమాల్లోని ర‌క్త‌పాతం.. హింస, నిర్దాక్షిణీయంగా చంపుకోవ‌డంతో పొలిస్తే స‌లార్ లో మ‌రీ అంత హింస లేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.