NTV Telugu Site icon

Prithviraj Sukumaran: ప్రభాస్ లో నాకు అదే నచ్చలేదు.. చాలా డేంజరస్ పర్సన్

Pp

Pp

Prithviraj Sukumaran: పృధ్వీరాజ్ సుకుమారన్.. ప్రస్తుతం ఈ పేరు తెలుగులో చాలా తక్కువ మందికి తెలుసు. డిసెంబర్ 22 తరువాత ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అందుకు కారణం.. ఈ స్టార్ హీరో.. ప్రభాస్ తో పోటీగా నటించడానికి రెడీ అయ్యాడు. మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు తెలుగువారిని పలకరించేవాడు. అతనొక మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. హీరో, డైరెక్టర్, నిర్మాత.. ఒకటి అని చెప్పాలేం .. ఒక్క ఏడాది దాదాపు 5 సినిమాలను రిలీజ్ చేయడమే కాకుండా హిట్ అందుకున్న ఘనత అతనికే చెల్లుతుంది. అంతేకాకుండా దాదాపు ఐదేళ్ల వరకు.. అతని కాల్షీట్స్ దొరకడం కూడా కష్టమే అని చెప్పాలి. ఇక పృధ్వీరాజ్.. సలార్ లో నటిస్తున్నాడు అన్నప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్, సాంగ్ చూసాక.. వరదరాజా మన్నార్ పాత్రలో అతడిని కాకుండా వేరేవారిని ఉహించుకోవడమే కష్టమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. దర్శకధీరుడు రాజమౌళితో చిత్రబృందం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఇక ఆ ఇంటర్వ్యూలో పృధ్వీరాజ్ సుకుమారన్ .. ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ లో మీకు నచ్చనిది ఏంటి.. ? అన్న రాజమౌళి ప్రశ్నకు పృధ్వీరాజ్ మాట్లాడుతూ.. ” అతనితో ఉంటే డైట్ చేయలేము. ఏదైనా మనకు నచ్చింది అని చెప్తే.. నెక్స్ట్ మినిట్ మన రూమ్ లో ఉంటుంది. ఒకరోజు నేను నా 9 ఏళ్ళ కూతురు ఒకరోజు సెట్ కు వెళ్లాం. అక్కడ ప్రభాస్.. నా కూతురును నీకు ఏది ఇష్టం అని అడిగాడు. తను చిన్నపిల్ల.. తనకు నచ్చినవి మొత్తం 20 వరకు చెప్పింది. అంతే.. ఆరోజు రాత్రి ఆ ఫుడ్ పెట్టడానికి నాకు ఇంకొక రూమ్ కావాల్సివచ్చింది. నేను అబద్దం చెప్పడం లేదు.. జరిగిన వాస్తవం ఇది. మా ఇంట్లో ఉండేది మేము ముగ్గురమే .. ఆ ఫుడ్ చూస్తే … ఎంతమంది ఇంటికి వస్తున్నారో అన్నట్లు ఉంది. కానీ, అతను మాత్రం ఒక చిన్న బౌల్ లో అన్నం, పప్పు వేసుకొని తింటాడు. ఇక ఇది ఒక్కటే కాదు. నాకు కార్లు అంటే చాలా ఇష్టం. ఒకరోజు ప్రభాస్ తో అదే చెప్పాను.. చాలా రోజులు అయ్యింది.. డ్రైవ్ కు వెళ్లి అని.. వెంటనే తన లాంబోర్గిని ఇస్తాను.. కొన్నిరోజులు ఉంచుకో అన్నాడు.. ఇతనికేమైనా పిచ్చా అని అనుకున్నాను.. ప్రభాస్ చాలా డేంజరస్ పర్సన్” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.