Site icon NTV Telugu

Prithviraj Sukumaran: బిగ్ బ్రేకింగ్.. ‘సలార్’ విలన్ కు ప్రమాదం.. హాస్పిటల్ లో చికిత్స

Salaar

Salaar

Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు ప్రమాదం జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మలయాళంలో విలయత్ బుద్ద అనే సినిమాలో నటిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పృథ్వీరాజ్ పాల్గొంటున్నాడు. నేడు యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా.. ఆయనకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. వెంటనే ఆయనను కొచ్చిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.
కాలికి దెబ్బ తగలడంతో రేపు ఉదయం ఆయనకు ఒక చిన్న ఆపరేషన్ చేయనున్నారట వైద్యులు. ఈ ఆపరేషన్ తరువాత పృథ్వీరాజ్ రెండు, మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ప్రాణాలకు ఏమి ప్రమాదం లేదని, చిన్న గాయాలే అని ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.

Shriya Saran: శ్రియా.. నువ్వొక బిడ్డకు తల్లివి.. మరీ ఇంత దారుణంగా డ్రెస్సింగ్..

ఇకపోతే పృధ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలో టాప్ బిజీయెస్ట్ హీరో అంటే ఇతనే. తెలుగువారికి కూడా పృథ్వీరాజ్ సుపరిచితమే. పవన్ కళ్యాణ్, రానా నటించిన భీమ్లా నాయక్ ఒరిజినల్ వెర్షన్ లో హీరోగా నటించింది పృథ్వీరాజ్ నే. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పృథ్వీరాజ్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో వరదరాజ మన్నార్ గా నటిస్తున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో తెలుగు అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Exit mobile version