Site icon NTV Telugu

Salaar: పెద్ద ట్విస్ట్ ఇచ్చిన పృథ్వీరాజ్

Prithviraj On Salaar

Prithviraj On Salaar

ప్రస్తుతం భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ‘బాహుబలి’ ప్రభాస్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో.. నేషనల్ లెవెల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్టుగానే దర్శకుడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కీలక పాత్రల కోసం ఏరికోరి మరీ క్రేజీ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఓ ప్రధాన పాత్ర కోసం సెలక్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ కూడా ‘రాధేశ్యామ్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో వెల్లడించాడు.

అయితే, లేటెస్ట్ గా మాత్రం పృథ్వీరాజ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. సలార్ స్క్రిప్ట్ అదిరిపోయిందని, తనకు బాగా నచ్చిందని చెప్పిన ఈ నటుడు.. డేట్స్ విషయమై తనకు, ప్రశాంత్ నీల్ మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయని షాకిచ్చాడు. పృథ్వీరాజ్ తన ప్రాజెక్టులతో బిజీ అయిపోవడం, సలార్ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుండటంతో.. ఈ చిత్రానికి అతడు డేట్స్ కేటాయించలేక, తన నిర్ణయాన్ని ఇంకా పెండింగ్ లోనే పెట్టాడని తెలుస్తోంది. రెండేళ్ల కిందట ఈ కథను ప్రశాంత్ నీల్ తనకు వినిపించాడని, ఈ స్క్రిప్ట్ తనను బాగా త్రిల్ చేసిందన్నాడు. స్క్రిప్ట్ విషయంలో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని చెప్పిన పృథ్వీరాజ్.. డేట్స్ సర్దుబాటు చేయాల్సి ఉందని బాంబ్ పేల్చాడు. డేట్స్ కుదిరితే పర్వాలేదు కానీ, కుదరకపోతే మాత్రం పృథ్వీరాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టే. అలా జరగకూడదని కోరుకుందాం.

కాగా.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ‘సలార్’లో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ అమ్మడు ‘ఆధ్య’ అనే ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతోంది. రాజమనార్ అనే మరో కీ రోల్ లో జగపతి బాబు నటిస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా మొదటి భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version