Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prithviraj Sukumaran Comments At Goat Life Pre Release Press Meet

Prithviraj Sukumaran: చిరంజీవి రెండు ఆఫర్స్ ను రిజెక్ట్ చేశా.. నాలుగేళ్లు ఎదురుచూశారు

Published Date :March 22, 2024 , 10:20 pm
By Bhargav Chaganti
Prithviraj Sukumaran: చిరంజీవి రెండు ఆఫర్స్ ను రిజెక్ట్ చేశా.. నాలుగేళ్లు ఎదురుచూశారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prithviraj Sukumaran Rejected Chiranjeevi Movie Offers for Goat Life: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను బెన్యామీను రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించగా విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తుంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ ఇటీవల వరదరాజ మన్నార్ అనే కింగ్ క్యారెక్టర్ లో సలార్ తో మీ ముందుకు వచ్చా, ఇప్పుడు “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాతో నజీబ్ అనే స్లేవ్ క్యారెక్టర్ తో తెరపైకి రాబోతున్నా, వరదరాజ మన్నార్ పూర్తిగా ప్రశాంత్ నీల్ ఇమాజినేషన్. కానీ ఈ సినిమా వాస్తవంగా జరిగిన కథ. నజీబ్ మన మధ్యే సజీవంగా ఉన్నాడు, 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వ్యక్తి అతను. ఈ ప్రయాణంలో తను ఎదుర్కొన్న కష్టాలు వివరిస్తూ రాసిన పుస్తకం ఈ గోట్ డేస్. బెన్యామీను రాసిన ఈ పుస్తకం కేరళలో 2008లో పబ్లిష్ అయ్యింది, ఇది పబ్లిష్ అవగానే ప్రతి ఒక్కరి చేతుల్లోకి వెళ్లింది. అంత ఆదరణ పొందింది గోట్ డేస్. కేరళలో ప్రతి దర్శకుడు, హీరో, ప్రొడ్యూసర్ ఈ నవల హక్కులు తీసుకోవాలని ప్రయత్నించారు. చివరకు ఆ హక్కులను మా డైరెక్టర్ బ్లెస్సీ సాధించారు.

అదృష్టవశాత్తూ నజీబ్ గా నటించే అవకాశం నాకు దక్కింది. 2009 ప్రారంభంలో ఈ సినిమాకు కమిట్ అయ్యాం. అయితే ఆ టైమ్ లో ఈ సినిమాకు కావాల్సిన బడ్జెట్ ఖర్చు చేయడం అసాధ్యంగా ఉండేది. పదేళ్ల తర్వాత 2018లో షూటింగ్ ప్రారంభించాం. అప్పటికి ప్రాంతీయ సినిమాల మార్కెట్ స్థాయి పెరిగింది. మలయాళ సినిమాలకు ఆదరణ పెరిగింది. 2019లో షూటింగ్ ప్రారంభించాం. జోర్డాన్ లో షెడ్యూల్ చేశాం. కేరళ పోర్షన్స్ కంప్లీట్ చేశాం. నేను ఈ సినిమా కోసం మొదట బరువు పెరిగి ఆ తర్వాత 31 కిలోలు తగ్గాను. బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాం. ఇప్పటికి కూడా ఈ సినిమా బడ్జెట్ రిస్కు చేయడమే. మేము తిరిగి జోర్డాన్ లో షూటింగ్ స్టార్ట్ చేసేప్పటికి కోవిడ్ లాక్ డౌన్ వచ్చింది. మూడు నెలలు పూర్తిగా షూటింగ్ ఆపేశాం. మేము భారత్ కు తిరిగి రావడం కూడా కష్టమైంది. వందే భారత్ స్పెషల్ ఫ్లైట్ లో ఇండియా వచ్చాం. పాండమిక్ ఎప్పటికి ఆగిపోతుందో తెలియదు. ఏడాదిన్నర తర్వాత అల్జీరియాలోని టిముమౌన్ అనే ప్లేస్ లో షూటింగ్ స్టార్ట్ చేశాం. సహార ఎడారి మధ్యలో ఉంటుందా లొకేషన్. అక్కడికి ఏ సినిమా యూనిట్ వెళ్లలేదు. మా బ్లెస్సీ సార్ కు సినిమా పిచ్చి. ఆయన వల్లే మేమంతా అక్కడ షూటింగ్ చేయగలిగాం. బ్లెస్సీ సార్ తో మలయాళ ఇండస్ట్రీ ప్రతి ఆర్టిస్ట్ ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారు. అంత గొప్ప దర్శకుడాయన. అల్జీరియా తర్వాత జోర్డాన్ తిరిగొచ్చి మిగిలిన పార్ట్ షూట్ చేశాం. 2022 కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లాం. ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడక్షన్ జరిగింది.

“ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా జీరో కాంప్రమైజ్డ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఒక్క ఫ్రేమ్ కూడా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ లో రాజీ పడకుండా రూపకల్పన చేశాం. 2008 లో అనుకున్న సినిమా ఫైనల్ గా 2024 మార్చి 28న మీ ముందుకు వస్తోంది. ఇంత కష్టపడిన ఈ సినిమాను పర్పెక్ట్ గా రిలీజ్ చేయాలని అనుకున్నాం. అదృష్టవశాత్తూ తెలుగులో మైత్రీ మూవీ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇది నా కెరీర్ లో ఎంతో ముఖ్యమైన సినిమా అని రవి గారికి మెసేజ్ పంపాను. ఆయన డన్ సార్ అంటూ రిప్లై ఇచ్చారు. తమిళంలో రెడ్ జయింట్, కన్నడలో హోంబలే ఫిలింస్, నార్త్ లో నా ఫ్రెండ్ అనిల్ రిలీజ్ చేస్తున్నారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో చేసిన సినిమా ఇది. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ ఎమోషన్స్ ఫీల్ అవుతారు. టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉంటుంది. ఈ సినిమా చూశాక ప్రేక్షకులెవరూ ఈ సినిమాను ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది అని అనరు. మీ అందరికీ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా. చిరంజీవి గారి సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ కీ రోల్ కోసం నన్ను అడి . అప్పుడు ఈ మూవీ కోసమే ప్రిపేర్ అవుతున్నా అందుకే నటించలేకపోతున్నా అని ఆ విషయాన్ని ఆయనకు వివరించాను. ఆ తర్వాత లూసీఫర్ తెలుగు రీమేక్ గాఢ్ ఫాదర్ ను నన్నే డైరెక్టర్ చేయమన్నారు. అప్పడు కూడా గోట్ లైఫ్ సినిమా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. చిరంజీవి అన్నారు నువ్వు సేమ్ స్టోరీ చెబుతున్నావ్ అని. మీ సినిమాలో నటించడం నాకెంతో ఇష్టం సార్ కానీ కుదరడం లేదు అని హంబుల్ గా చెప్పాను. ఆ తర్వాత చిరంజీవి రెగ్యులర్ గా మెసేజ్ స్ పంపుతూ ఉండేవారు. గాడ్ ఫాదర్ రిలీజ్ రోజున కూడా మెసేజ్ పంపారు. ఫ్యూచర్ లో అవకాశం వస్తే తప్పకుండా చిరంజీవి గారితో కలిసి పనిచేస్తా అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Prithviraj Sukumaran
  • Prithviraj Sukumaran Comments
  • Prithviraj Sukumaran News

తాజావార్తలు

  • Off The Record : అంబటి రాంబాబు పెద్ద ప్లానింగ్ లో ఉన్నాడా..?

  • Telangana: కీలక అలర్ట్.. ఆ జిల్లాలో మార్చి 28న బంద్.. కారణం ఇదే..

  • Heart Touching Story : చనిపోయినా విడిపోలేదు.. విగ్రహాలు కట్టి ప్రతి ఏడాది పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు.!

  • America Currency: 165 ఏళ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్.. ఇక అమెరికా కరెన్సీపై ట్రంప్ సంతకం..

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

ట్రెండింగ్‌

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions