NTV Telugu Site icon

Prithviraj Sukumaran: సలార్ లో వరదరాజా.. వణికించేటట్టు ఉన్నాడే

Salar

Salar

Prithviraj Sukumaran: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా భారీ నష్టాలను చవిచూసింది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ ఫ్యాన్స్ అందరు.. కాదు.. కాదు.. ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమా సలార్. కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి.. ఇండియాను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు కావడంతో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు.

Saindhav: సైకోగా వెంకటేష్.. అందుకే ఆ పేరు పెట్టానంటున్న శైలేష్ కొలను!

అసలు అన్ని అనుకున్నట్లు జరిగితే సలార్ రిలీజ్ అయ్యి నెల అయ్యేది. కానీ, అనుకోకుండా సలార్ రిలీజ్ డేట్ మారిపోయింది. సెప్టెంబర్ లో వస్తుంది అనుకున్నది డిసెంబర్ లో రానుంది. అందుకే ఇలా పోస్టర్స్ తో సర్దుకోవాల్సి వస్తుంది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్.. ఈ చిత్రంలో వరదరాజా మన్నార్ గా కనిపించనున్నాడు. గతేడాది అతని పుట్టినరోజుకు కూడా సేమ్ ఇలాంటి పోస్టర్ నే రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు కూడా వరద రాజా సీరియస్ లుక్ లో యుద్దానికి సిద్దమైనవాడిలా నిలబడినట్లు కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్స్ చూస్తుంటేనే.. వరదరాజా ఎంతటి క్రూరుడో అర్ధమవుతుంది. ఇక సలార్ లో వరదరాజా.. వణికించేటట్టు కనిపిస్తున్నాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Show comments