NTV Telugu Site icon

Prithviraj: మలయాళం నుంచి సలార్ నటుడి పాన్ ఇండియా ప్రాజెక్ట్

Prithviraj

Prithviraj

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సలార్’లో విలన్ గా నటిస్తున్నాడు మలయాళ సూపర్ స్టార్ ‘పృథ్వీరాజ్ సుకుమారాన్’. ఏడాదికి ఆరు సినిమాలు ఈజీగా చేసే పృథ్వీరాజ్, గత పదమూడేళ్లుగా ఒక సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. ‘ఆడు జీవితం’ అనే టైటిల్ తో 2010 నుంచి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ‘బ్లెస్సీ థామస్’ డైరెక్ట్ చేస్తున్నాడు. 2008లో వచ్చిన ఆడు జీవితం అనే నవల ఆధారంగా ఈ సినిమా అనౌన్స్ అయ్యింది. అమలా పాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ తిరువల్లా, పాలక్కడ్, సౌదీ అరేబియా, సహారా డెసర్ట్ లో షూటింగ్ జరుపుకుంది. రెహమాన్ మ్యూజిక్ తో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్న ఈ సినిమాపై మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారి అంచనాలు ఉన్నాయి. 2023 చివరిలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్ ని రీసెంట్ గా కంప్లీట్ చేసి ఇటివలే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారు.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ని టార్గెట్ చేస్తూ ఆడు జీవితం ట్రైలర్ ని కట్ చేసిన మేకర్స్, కొంతమంది కారణంగా షాక్ కి గురయ్యారు. ఎవరో ఆడు జీవితం ట్రైలర్ ని సోషల్ మీడియాలో లీక్ చేసేశారు. ఇక చేసేదేమీ లేక పృథ్వీరాజ్, ట్విట్టర్ లో… “Yes, the “release” was unintentional. No, it wasn’t meant to be “leaked” online. The #AADUJEEVITHAM, The GOAT LIFE (unfinished, work in progress) trailer meant exclusively for various festivals around the world. Hope you like what you see.” అంటూ పోస్ట్ చేశాడు. దాదాపు దశాబ్దమున్నర కష్టాన్ని సోషల్ మీడియాలో లీక్ చెయ్యడం అనేది ఎవరికైనా ఇబ్బంది కలిగించే విషయమే. అందుకే పృథ్వీరాజ్ తనే ఇంకా వర్క్ పెండింగ్ లో ఉన్న రా వెర్షన్ ట్రైలర్ ని అలానే రిలీజ్ చేసేసాడు. ఈ ట్రైలర్ లో విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి, పృథ్వీరాజ్ లుక్ అండ్ మేకోవర్ షాకింగ్ గా ఉంది. ఒకవేళ లీక్ కాకుండా ఉంటే అఫీషియల్ గా మేకర్స్ నుంచి వచ్చే ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేది.   

Show comments