Site icon NTV Telugu

జీవితపై ఫిర్యాదు చేసిన నటుడు పృథ్వీ

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జీవిత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల అధికారికి లేఖ రాయడంతో మరో వివాదం మొదలైంది. మా సభ్యులను జీవిత మభ్యపెడుతున్నారంటూ పృథ్వీ తన లేఖలో ఆరోపించారు. గతంలో జనరల్ సెక్రటరీ పదవిలో ఉన్న జీవిత, తనకు ఓట్లేస్తేనే ప్రయోజనాలు ఉంటాయని చెబుతోందని.. ఆమె నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్లడించారు. ఆమెపై క్రమశిక్షణ కమిటీ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరారు. జీవిత మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీ చేస్తుండగా, మంచు విష్ణు ప్యానెల్లో ఉన్న పృథ్వీరాజ్ మా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. అక్టోబరు 10న మా ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మంచు విష్ణు ఈరోజు తన ప్యానెల్ ను ప్రకటించారు.

Exit mobile version