NTV Telugu Site icon

Prema Deshapu Yuvarani: ‘ప్రేమదేశపు యువరాణి’ కోసం సునీత పాడిన సాంగ్ రిలీజ్

Premadesham Yuvarani

Premadesham Yuvarani

Prema Deshapu Yuvarani Releasing on September 2nd: పవన్‌కల్యాణ్‌ వీరాభిమాని అయిన సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వం వహించిన ‘ప్రేమదేశపు యువరాణి’ రిలీజ్ కి రెడీ అయింది. యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి హీరో హీరోయిన్లుగా ఈ సినిమాను ఏజీఈ క్రియేషన్స్‌, ఎస్‌2హెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ‘మసకతడి’ పాటను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ క్రమంలోనే మరోపాటను ఆవిష్కరించారు. ‘నిశబ్దం’ అంటూ సాగే పాటను జనసేన పార్టీ స్పోక్స్‌ పర్సన్‌ రాయపాటి అరుణ చేతుల మీదుగా టీమ్ విడుదల చేసింది. అజయ్‌ పట్నాయక్‌ సంగీతం అందించిన ఈ పాటను గాయని సునీత ఆలపించారు, అయితే ఈ సినిమా దర్శకుడే ఈ పాటను రాయడం విశేషం.

Sharukh: కింగ్ ఖాన్ చెన్నై వస్తున్నాడు… నెక్స్ట్ హైదరాబాద్ కే…

పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అయిన దర్శకుడు సెప్టెంబర్‌ 2న పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాను విడుదల చేస్తుండడం గమనార్హం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎమోషనల్‌గా బాండింగ్‌ ఉన్న సబ్జెక్‌ ఇది అని, ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కించామని అన్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అదే బాండింగ్‌తో సినిమా జ్ఞాపకాలను ఇంటికి తీసుకెళ్తారని పేర్కొన్న ఆయన అవుట్‌పుట్‌ బాగా వచ్చిందని అన్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌, పాటలకు మంచి స్పందన వచ్చిందని, అరుణ గారు తాజాగా విడుదల చేసిన పాట కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని అన్నారు. ఇక ఈ సినిమాలో మెహబూబ్‌ బాషా, హరికృష్ణ, యోగి కద్రి, రఘు, సునీత, మనోహర్‌, పవన్‌ ముత్యాల, రాజారెడ్డి, సందీప్‌, స్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపి నాయుడు కూడా కీలక పాత్రలలో నటించారు.