NTV Telugu Site icon

Prem Kumar: పీటల మీద పెళ్లాగిపోతే, మగాడు పడే కష్టమే.. ‘ప్రేమ్ కుమార్’

Prem Kumar Movie Story

Prem Kumar Movie Story

Prem Kumar Movie Story Revealed by Santosh Sobhan: సంతోష్ శోభ‌న్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా మూవీ ‘ప్రేమ్ కుమార్’. చాల సినిమాల్లో నటించిన చేసిన, రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ఆగ‌స్ట్ 18న‌ రిలీజ్ అవుతోన్న క్రమంలో సంతోష్ శోభ‌న్ మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ ఈ సినిమా ఎలాంటిది, కధ ఏమిటి అనే వివరాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ చాలా కాలం, చాలా తెలుగు సినిమాల్లో క‌ళ్యాణ మండ‌పం మీద క్లైమాక్స్ ఉండే సినిమాలు ఉన్నాయని, అక్క‌డ‌కు హీరో వ‌చ్చి హీరోయిన్‌కి, ఆమె ఫాద‌ర్‌కి క‌లిపి ఏవో నాలుగు నీతులు చెప్పి హీరోయిన్‌తో వెళ్లిపోతాడని అన్నారు. కానీ అక్క‌డొక‌డు మిగిలిపోతాడు, వాడి ప‌రిస్థితేంటో తెలీదు, ఎంత మందికి కార్డులిచ్చాడో, ఎన్ని అప్పులు చేశాడో, బ‌ట్ట‌లు ఎలా కొనుకున్నాడో? అనే విష‌యాల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోరని అన్నాడు.

Jailer: వర్మ ప్లే లిస్ట్ లో డ్యాన్స్ చేసిన వ్యక్తి చనిపోయాడని మీకు తెలుసా.. ?

అలాంటి వాడిపై ద‌ర్శ‌కుడు అభిషేక్ చేసిన సినిమానే ఈ ‘ప్రేమ్ కుమార్’ అని, వందేళ్ల ఇండియ‌న్ సినిమాల్లో ఎన్నో క్యారెక్ట‌ర్స్, ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఓ ఆర్టిస్ట్ లైఫ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌ని క‌థో, ఎవ‌రు చేయ‌ని పాత్ర‌ను ఎలివేట్ చేయ‌టం అనేది పూర్తిగా కొత్త‌గా ఉంటుందని సంతోష్ చెప్పుకొచ్చారు. ఏక్ మినీ క‌థ పాయింట్ అనేది తెలుగు సినిమాలో చెప్ప‌టం నాకు తెలిసి ఫ‌స్ట్ టైమ్‌ అని అలాగే మండపంపై మిగిలిపోయే వాడి క‌థ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చెప్ప‌లేదు, అలాంటి వ్య‌క్తికి కూడా ఓ ఎమోష‌న్ ఉంటుంది కదా దాన్ని డైరెక్ట‌ర్ అభిషేక్ చ‌క్క‌గా రాసుకున్నాడు అది కూడా ఎంట‌ర్ టైనింగ్ వేలో అని సంతోష్ చెప్పుకొచ్చాడు. ‘ప్రేమ్ కుమార్’ క‌థ‌కు అస‌లైన ఇన్‌స్పిరేష‌న్ ఏంటో నాకు తెలియ‌దు కానీ డైరెక్ట‌ర్ అభిషేక్ త‌న‌కు తెలిసిన కొందరు వ్య‌క్తులు అలాంటి సిట్యువేష‌న్స్‌ను ఫేస్ చేశార‌నైతే చెప్పారని అన్నారు. ‘ప్రేమ్ కుమార్’ టైటిల్ మాత్రం రాశి ప్రొడ‌క్ష‌న్స్ సూర‌జ్ భ‌ర్జ‌త్యాగారి సినిమాల్లో హీరో పేరు ప్రేమ్ అని ఉంటుందని, టైటిల్ ఆలోచ‌న అక్క‌డి నుంచి వ‌చ్చిందేనని అన్నారు. ప్రేమ్ కుమార్ అనే యువ‌కుడు ఎన్ని రిస్కులు చేసి పెళ్లి చేసుకుంటాడు అనేదే ఈ సినిమా అని అన్నారు.

Show comments