Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie Trailers Preface Of Manucharitra Teaser Out

ప్రేమలోని గాఢతను తెలిపేలా ‘మనుచరిత్ర’ టీజర్!

Published Date :October 7, 2021 , 4:59 pm
By ramakrishna
ప్రేమలోని గాఢతను తెలిపేలా ‘మనుచరిత్ర’ టీజర్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘చూసీ చూడంగానే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్ ప‌తాకంపై నార‌ల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ‘మను చరిత్ర’ ప్రీ ఫేస్ పేరుతో టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ”ఇంటెన్స్ లవ్ స్టోరీలతో వచ్చిన చిత్రాలు కచ్చితంగా హిట్ అవుతాయి. ఈ సినిమానూ దేనితోనూ పోల్చడం నా ఉద్దేశ్యం కాదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా భరత్ కథ రాసుకున్నాడు. ఎక్కడా కూడా వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు కనిపించవు. ఇక ఈ సినిమాకు అతి పెద్ద బలం గోపీ సుందర్. అద్బుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు మరో బ్యాక్ బోన్ ధనుంజయ. ఆయన ఇప్పుడు పద్నాలుగు సినిమాలను చేస్తున్నారు. రేపు ‘పుష్ప’ విడుదలయ్యాక ధనుంజయ ఏంటో తెలుస్తుంది” అని అన్నారు.

దర్శకుడు భరత్ మాట్లాడుతూ ”సిరాశ్రీ వల్లే ఈ చిత్రం ప్రారంభమైంది. ఆయనే రాజ్ కందుకూరితో కలిపించారు. ఆయనకు స్క్రిప్ట్ నచ్చింది. ఆ తరువాత శివ, మేఘా ఆకాష్, ప్రగతి ఇలా అందరూ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ధనుంజయ గారు ఈ సినిమాను ఒప్పుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. నేను ఏ కథ రాసినా ముందుగా మధు గారికి వినిపిస్తాను. ఆయనే నా ఫిలాసఫర్. సినిమాటోగ్రఫర్ రాహుల్ శ్రీవాత్సవ ఈ సినిమాలో తన లైఫ్ పెట్టేశారు. చంద్రబోస్ గారు మా సినిమాకు రెండు పాటలు రాయడమే కాకుండా నటించారు. సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ మత్తు కొంతసేపే ఉంటుంది. కానీ ‘మనుచరిత్ర’ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది” అని చెప్పారు.

నిర్మాత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ”ఏ సినిమాకు అయినా కథే ముఖ్యం. సినిమాను చూపించినట్టుగానే రెండు మూడు గంటల పాటు డైరెక్టర్ భరత్ స్టోరీ నెరేషన్ ఇచ్చారు. ఈ సినిమాకు కథే బలం అని అప్పుడే అర్థమైంది. అందుకే వినగానే ఓకే చెప్పాం. మీడియా సహాయసహకారాలు అందిస్తే.. మేం మరిన్ని మంచి చిత్రాలను తీస్తాం” అని అన్నారు.

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్క నటుడు తన కెరీర్‌లో ఓ సినిమా చేయాలి అనుకుంటారు. అదే మనుచరిత్ర’. నవ్వించాలి, ఏడిపించాలి, యాక్షన్ చేయాలని అనుకుంటారు. అలా హీరోలకు ఓ బకెట్ లిస్ట్ ఉంటుంది. నా బకెట్ లిస్ట్ అంతా కూడా ఈ ఒక్క చిత్రంతోనే నెరవేరింది. ఏ సినిమాకైనా మంచి యూనిట్ దొరకడం అదృష్టం. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరూ ప్రేమిస్తూ పని చేశారు. ప్రతీ ఒక్క ఫ్రేమ్‌లో అది మీకు కనిపిస్తుంది. నాకు ఈ చిత్రం ద్వారా సుహాస్, ధనుంజయ్ రూపంలో ఇద్దరు మంచి స్నేహితులు దొరికారు. ఈ సినిమా చూశాక మీరంతా కూడా మేఘా ఆకాష్ ప్రేమలో పడిపోతారు. నిర్మాత శ్రీనివాస్ రెడ్డి గారు మమ్మల్ని నమ్మి, దేని గురించి కాంప్రమైజ్ కాకుండా మాకు సపోర్ట్‌గా నిలిచారు. సెకండ్ వేవ్ తరువాత వచ్చిన చిత్రాలు మీడియా వల్లే ప్రేక్షకులకు అంతగా రీచ్ అవుతున్నాయి. నా సినిమా కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను” అని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bharath Pedagani
  • Gopi Sundar
  • MANUCHARITRA
  • MANUCHARITRA Teaser
  • Megha Akash

తాజావార్తలు

  • Turkey: టర్కీలోని ఇజ్రాయెల్ కాన్సులేట్‌పై కాల్పులు.. ముగ్గురు దుండగులు హతం

  • Congress vs TMC: బెంగాల్‌లో మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ వ్యూహం..

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • Dragon : ఎన్టీఆర్ కారణంగా నిలిచిన షూట్?

  • Ananya Birla-RCB: అన్ని కోట్లు ఉన్నా ఆ సింప్లిసిటీ ఏందయ్యా.. ఆర్‌సీబీ ఓనర్ అనన్య అదుర్స్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions