NTV Telugu Site icon

Preetham Jukalkar: నాగచైతన్య పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రీతమ్..

Whatsapp Image 2023 06 18 At 8.51.04 Am

Whatsapp Image 2023 06 18 At 8.51.04 Am

టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత నాగచైతన్య గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వీళ్ళిద్దరి గురించి ఏ చిన్న వార్త వచ్చిన కూడా  అది బాగా వైరల్ అవుతుంది.. ఇక తాజాగా సమంత స్టైలిస్ట్ అయిన ప్రీతమ్ జుకాల్కర్ నాగ చైతన్య గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నాగచైతన్య సమంత విడిపోయినప్పుడు దానికి ప్రధాన కారణం ప్రీతమ్ జుకాల్కర్ అని,ఆయనతో సమంతకి ఉన్న ఎఫైర్ వల్లే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని ఎన్నో వార్తలు వినిపించాయి.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతమ్ ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ప్రీతమ్ జుకాల్కర్ మాట్లాడుతూ నాకు సమంతకు చాలా మంచి రిలేషన్ ఉంది.. మా ఇద్దరి మధ్య ప్యూర్ అన్నాచెల్లెళ్ల బంధం మాత్రమే ఉంది.కానీ ఆ బంధాన్ని కొంతమంది వేరుగా అర్థం చేసుకున్నారు.ఇక మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నాగచైతన్య కి కూడా బాగా తెలుసు.

నేను ఎన్నో సార్లు వారి ఇంటికి వెళ్ళినప్పుడు నాగచైతన్య నన్ను ఎంతో బాగా చూసుకునేవారు. అయితే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు. అలా నేను కూడా సమంత కి దగ్గరయ్యాను. కానీ మా మధ్య ఉన్న రిలేషన్ ని మాత్రం చాలా మంది తప్పుగా అర్థం చేసుకొని మా ఇద్దరికీ ఎఫైర్ అంటగట్టారు. ఇక ఎప్పుడైతే ఆ వార్తలు వినిపించాయో ఆరోజు నాకు ఎంతో కోపం వచ్చింది.అసలు విషయం తెలియకుండా ఇలా లేనిపోని పుకార్లు ఎలా సృష్టిస్తారు అంటూ కోపంతో ఊగిపోయాను.కానీ చాలామంది ఇలా కోపానికి వస్తే నీ కెరియర్ పాడవుతుంది అని చెప్పడంతో లోలోపల ఎంతగానో బాధ పడ్డాను.. బయటికి చెప్పుకోలేని బాధతో ఇన్నాళ్లు కుమిలిపోయాను అంటూ ప్రీతమ్ జుకాల్కర్ చెప్పుకొచ్చారు. ఇక సమంత నాగచైతన్య విడిపోయిన సమయం లో ప్రీతమ్ జూకాల్కర్ పేరు ఎక్కువగా వినిపించిన విషయం అందరికి బాగా తెలిసిందే.