NTV Telugu Site icon

Simhadri: బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి… రికార్డ్స్ లేపడానికి రెడీ

Simhadri

Simhadri

ఒక ఇరవై ఏళ్లకే ఒక కుర్ర హీరో టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి 55 సెంటర్స్ లో 175 రోజుల పాటు తన సినిమాని నడిపించి, ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అంటే అది మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక్క ‘ఎన్టీఆర్’కి మాత్రమే సాధ్యం అయ్యింది. 2003 జూలై 9 20 ఏళ్ల వయసులో ఎన్టీఆర్, రాజమౌళిల కాంబినేషన్ ఇండస్ట్రీకి ఒక మాస్ కమర్షియల్ హిట్ సినిమాని ఇచ్చింది. విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై వి.దొరస్వామి రాజు నిర్మించిన ఈ మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. జక్కన్న, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన రెండో సినిమా సింహాద్రి, ఈ మూవీ నందమూరి ఫాన్స్ కి చాలా స్పెషల్. అందుకే సింహాద్రి రీరిలీజ్ ని ఎన్టీఆర్ బర్త్ డే రోజున ప్లాన్ చేశారు. సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యి ఈ జూలైకి ఇరవై ఏళ్లు అవుతుంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున సింహాద్రి సినిమాని గ్రాండ్ స్కేల్ లో రీరిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చేసాయి.

సింహాద్రి రీరిలీజ్ కోసం ఏకంగా వరల్డ్స్ లార్జెస్ట్ IMAX స్క్రీన్ నే బుక్ చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ప్రపంచంలోనే అతిపెద్ద IMAX స్క్రీన్ ఉంది, ఈ స్క్రీన్ లో సింహాద్రి సినిమా స్పెషల్ షో పడుతుందని ఫాన్స్ అనౌన్స్ చేశారు. ‘టాలీవుడ్ ఇంటర్నేషనల్’ వాళ్లు సింహాద్రి సినిమాని ఆస్ట్రేలియాలో రిలీజ్ చేస్తున్నారు. మే 20 ఉదయం 9:00 గంటలకి ఈ స్పెషల్ షో పడుతుంది టికెట్స్ బుక్ చేసుకోండి అంటూ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. లేటెస్ట్ గా మే 9 నుంచి సింహాద్రి రీరిలీజ్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి, ఫాన్స్ రెడీగా ఉండండి అంటూ అనౌన్స్ చేశారు. దీంతో ఫాన్స్ మే 9న రీరిలీజ్ ప్రీబుకింగ్స్ లోనే ఒక బెంచ్ మార్క్ ని సెట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు.