Site icon NTV Telugu

Prabhas: బాహుబలి’ని కొట్టేలా ‘సలార్’ ఇంటర్వెల్ బ్యాంగ్!

Prabhas

Prabhas

ప్రభాస్ నుంచి మరో బాహుబలి లాంటి ప్రాజెక్ట్ రావాలంటే.. మళ్లీ రాజమౌళికే సాధ్యం అనే మాట ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అయితే ఈసారి మాత్రం లెక్కల్ని తారుమారు చేస్తూ బాహుబలిని కొట్టేందుకు రెడీ అవుతున్నాయి ప్రభాస్ నెక్స్ట్ సినిమాలు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్. ఈ సినిమాలన్నీ నెవర్ బిఫోర్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చెయ్యడానికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ముఖ్యంగా మాస్ ప్రాజెక్ట్ సలార్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పడో అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాల్లో బాహుబలి సినిమా పార్ట్ 1 అండ్ 2 ఇంటర్వెల్ బ్యాంగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. పార్ట్ వన్, పార్ట్‌ టు రెండింటిలోనూ ఇంటర్వెల్‌లోనే క్లైమాక్స్ చూపించాడు జక్కన్న. బాహుబలి బిగినింగ్‌లో రానా స్టాచ్యూని నిలబెట్టే ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. ఇక బాహుబలి కంక్లూజన్‌ ఇంటర్వెల్ బ్యాంగ్.. సీటులో కూర్చొనివ్వదు.

రానా పట్టాభిషేకం ఎపిసోడ్ గా ఓపెన్ అయ్యి, ప్రభాస్ ఎలివేషన్ సీన్ గా మారే ఈ ఎపిసోడ్ రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. ఇప్పటి వరకు టాలీవుడ్ చూసిన బెస్ట్ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఇదే. ప్రభాస్ కెరీర్ బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఇదే. కానీ ఇప్పుడు సలార్ ఇంటర్వెల్.. ప్రభాస్ కెరీర్ బెస్ట్‌గా నిలవబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభాస్ చేసిన హై ఓల్టేజ్ మాస్ ప్రాజెక్ట్‌గా సలార్‌ రాబోతోంది. అందుకే ఇంటర్వెల్ ఎపిసోడ్‌ని ప్రభాస్ కెరీర్ బెస్ట్‌గా డిజైన్ చేసాడట ప్రశాంత్ నీల్. ఈ సీక్వెన్స్‌లో ప్రభాస్ ఎలివేషన్, యాక్షన్ ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటుందట. బాహుబలిని బీట్ చేసేలా సలార్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటే మాత్రం సెప్టెంబర్ 28న థియేటర్స్ తగలబడి పోవడం ఖాయం. ఇక శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. జగపతిబాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Exit mobile version