NTV Telugu Site icon

NTR 31: ఇది కదా… ఫాన్స్ కి కావాల్సిన అనౌన్స్మెంట్

Ntr 31

Ntr 31

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఎన్టీఆర్ 30’ సినిమాకి ‘దేవర’ టైటిల్ ని ఫిక్స్ చేసి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. అల్లు అర్జున్ బ్లడీ బర్త్ డే బావా అంటూ ట్వీట్ చేసాడు. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ ఉన్నాడు అంటూ కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఇలా మే 19 ఈవెనింగ్ నుంచి ఎన్టీఆర్ ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ బయటకి వస్తూనే ఉన్నాయి. వీటన్నింటికన్నా ఎక్కువగా, ముందు వచ్చిన అన్ని అప్డేట్స్ ని మరిపించే రేంజులో, ఇదే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యే రేంజ్ అప్డేట్ బయటకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సోషల్ మీడియాలో హవోక్ క్రియేట్ చేస్తోంది. ఎన్నో రోజులుగా ఎన్టీఆర్ ఫాన్స్ ని ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆ అప్డేట్… ‘NTR31’ అనౌన్స్మెంట్ బయటకి వచ్చేసింది.

KGF, సలార్ సినిమాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్… మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనే వార్తనే చాలా పెద్ద విషయం. గత ఏడాది కాలంగా వినిపిస్తున్న ఈ న్యూస్ ని నిజం చేస్తూ లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజున ‘ఎన్టీఆర్ 31’ ప్రాజెక్ట్ ఆన్ అయినట్లు ప్రకటన వచ్చింది. ఈ ఇయర్ లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాయి. అయితే కొరటాల శివ-ఎన్టీఆర్ సినిమా డిలే అవ్వడం, ప్రశాంత్ నీల్ కూడా సలార్ సినిమా పనుల్లో ఉండడంతో ‘ఎన్టీఆర్ 31’ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఈ కన్ఫ్యూజన్ కి ఎండ్ కార్డు వేస్తూ ‘ఎన్టీఆర్ 31’ సినిమా 2024 మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్తుందని అప్డేట్ ని మేకర్స్ ఇచ్చేసారు. ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పే ‘ఎన్టీఆర్ 31’ సినిమా షూటింగ్ నెక్స్ట్ మార్చ్ నుంచి అనే అప్డేట్ బయటకి రాగానే ఎన్టీఆర్ ఫాన్స్ స్కై హైలో ఉన్నారు.  ఎన్టీఆర్ బర్త్ డే రోజున బయటకి వచ్చిన హ్యూజ్ కమర్షియల్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ప్రస్తుతం నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది.