Prashanth Varma : గత కొన్ని రోజులుగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మీద కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆయన చాలా సినిమాలను ప్రకటించాడు. వాటన్నింటికీ అడ్వాన్సుల రూపంలోనే వంద కోట్ల దాకా తీసుకున్నాడని.. ఇప్పుడు తాను కాకుండా వేరే వాళ్లతో డైరెక్షన్ చేయించి తాను పర్యవేక్షిస్తానని చెబుతున్నాడంటూ రూమర్లు వస్తున్నాయి. మాట తప్పడంతో ప్రశాంత్ వర్మ మీద కొందరు నిర్మాతలు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయినట్టు రూమర్లు ఉన్నాయి. ఇక నిన్న ఛాంబర్ లో నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు.. వర్సటైల్ యాక్టర్
‘హను-మాన్’ తర్వాత తమ సంస్థలోనే జై హనుమానర్, బ్రహ్మరాక్షస, మహాకాళీ, అధీర సినిమాలు చేస్తానని ప్రశాంత్ రూ.10.34 కోట్లు తీసుకుని.. ఇప్పుడు మూవీ తీయట్లేదని నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశాడనేది వార్త. తనపై ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ఫిర్యాదు చేసినట్లు జరుగుతున్న ప్రచారం పై ప్రశాంత్ వర్మ స్పందించాడు. ఇవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశాడు. తనను కొందరు టార్గెట్ చేసుకుని ఇలా ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. తనపై ఎవరూ ఫిర్యాదులు చేయలేదని.. ఈ వార్తలు చూసి తట్టుకోలేక ఇలా స్పందించాల్సి వస్తోందంటూ చెప్పాడు ప్రశాంత్.
Read Also : Bigg Boss 9 : వెధవ పొట్టేసుకుని ప్రేమ కావాలా.. భరణిపై మాధురి కామెంట్స్
