Pranaya Godari First Look Launched: ప్రముఖ కమెడియన్ అలీ ఇంటి నుంచి సదన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న ‘ప్రణయ గోదారి’ రిలీజ్ కి రెడీ అవుతోంది. పి.ఎల్.విఘ్నేష్ దర్శకుడుగా తెరకెక్కిన ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్‌ను అంబర్ పేట్ శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబర్ పేట్ శంకర్ మాట్లాడుతూ మంచి కంటెంట్ తో వస్తున్న ప్రణయ గోదావరి సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
ఈ చిత్రంలో హీరోగా ప్రముఖ హాస్య నటుడు అలీ సోదరుడు కుమారుడు సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్ గా, ఇతర కీలక పాత్రలలో సాయికుమార్, 30YRS పృథ్వి, జబర్దస్త్ రాజమౌళి, సునీల్ రావినూతల తదితరులు నటిస్తున్నారు. దర్శకుడు పి.ఎల్.విఘ్నేష్ రూపొందించిన ఈ సినిమాకు మార్కండేయ సంగీత దర్శకుడిగా.. ఈదర ప్రసాద్ కెమెరామెన్‌గా వ్యవహరించారు.
