న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24 న విడుదలకు సిద్దమవుతుంది. శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. వరుస అప్డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆఖరి పాట సిరివెన్నెల సాంగ్ ని రిలీజ్ చేసి ఆయనకు అంకితమిచ్చారు. ఇక తాజాగా ఆయన రాసిన రెండో పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ప్రణవాలయ పాహి.. పరిపాలయల పరమేసి..’ నాటు సాగిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటోంది.
సాయి పల్లవి అద్భుతమైన డాన్స్ , ఆమె ఎక్స్ ప్రెషన్స్ సాంగ్ కే హైలెట్ గా నిలిచాయి. స్వతాహాగా డాన్సర్ అయినా సాయి పల్లవి ఈ సాంగ్ లో దేవదాసి పాత్రలో నాటక రూపంలో మహంకాళి అమ్మవారిగా కనిపించింది. ఇక ఆమె డాన్స్ కి మంత్రముగ్దుడై చూస్తున్న శ్యామ్ సింగరాయ్ గా నాని కనిపించాడు. అనురాగ్ కులకర్ణి ఉత్సాహంగా పాడిన ఈ పాటకు జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ క్రిస్టమస్ కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రంతో నాని ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.