Sreerastu: ఒకే స్క్రీన్‌పై బ్రదర్స్.. తెలుగు, కన్నడ బాషలలో ‘శ్రీరస్తు’

Sreerastu

Sreerastu

సాధారణంగా ఇండస్ట్రీలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే అభిమానులకు పండగే. ఇప్పుడు అచ్చం అలాంటి ఒక భారీ మల్టీస్టారర్ ఫీట్‌తో సౌత్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ముస్తాబవుతోంది. ప్రముఖ నటుడు దేవరాజ్ వారసులు ప్రణమ్ దేవరాజ్, ప్రజ్వల్ దేవరాజ్ ఇద్దరూ ఒకే సినిమాలో సందడి చేయబోతుండటం ఇప్పుడు టాలీవుడ్, శాండల్ వుడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ప్రణమ్ దేవరాజ్ హీరోగా, ప్రజ్వల్ దేవరాజ్ ఒక కీలకమైన స్పెషల్ రోల్‌లో నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘శ్రీరస్తు’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా దర్శకుడు శంకర్ రెడ్డి, నిర్మాత పెండ్లిమడుగు హరి కృష్ణ గౌడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. తొలి సినిమాతోనే తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో సినిమాను నిర్మిస్తూ మేకర్స్ ఒక భారీ సాహసానికి తెరతీశారు. హరి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎక్కడా రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటిస్తోంది.

నేటి తరం యువతను ఆకట్టుకునేలా హీరో హీరోయిన్ల మధ్య సాగే ఒక అద్భుతమైన ప్రేమకథకు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు శంకర్ రెడ్డి ఈ చిత్రాన్ని చెక్కుతున్నారు. కథలోని ఎమోషన్స్‌ను పండించడానికి సీనియర్ నటులు సుమన్, ఆమని, దేవి ప్రసాద్‌లను రంగంలోకి దించారు. చైత్ర రాయ్, ప్రసాద్ బెహ్రా, రవి ప్రకాష్, రవి శివ తేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండటం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర ఈ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ అందిస్తుండగా, బాల సరస్వతి సినిమాటోగ్రఫీ విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. శ్రీ వర్కల ఎడిటర్‌గా, కృష్ణ మాయ ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసి ప్రమోషన్స్ హోరెత్తించడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ ఏడాదే ‘శ్రీరస్తు’ను థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏకకాలంలో రెండు భాషల్లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి!