ప్రకాశ్ రాజ్ వారం పాటు మౌనవ్రతం లో ఉండబోతున్నారు. ఇదేదో ఆయన ఎవరిమీదో నిరసనతో చేస్తున్నది మాత్రం కాదు! ఇటీవల కొంత అనారోగ్యానికి గురైన ప్రకాశ్ రాజ్ ఎందుకైనా మంచిదని కంప్లీట్ బాడీ చెకప్ చేయించారట. అంతా బాగుందని డాక్టర్లు చెప్పారట. అయితే వోకల్ కార్డ్స్ కు వారం పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి ఇవ్వమని వైద్యులు సలహా ఇచ్చారట. అందుకోసమే ‘మౌనవ్రతం’ పాటించబోతున్నానని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
ప్రతి విషయం మీద తన స్పందనను సూటిగా తెలిపే ప్రకాశ్ రాజ్ లాంటి వ్యక్తి మౌనంగా ఉండటం కష్టమే. కానీ ఆయన మౌనం కొందరికి వరంగా మారుతుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో ఆ మౌనం ఆయనకూ ఆరోగ్యపరంగా ఓ వరమే! అయినా మాట్లాడే నోరును ఆయన మూసుకోవచ్చు కానీ, చేతల ద్వారా స్పందనను తెలిపే అవకాశం ఉంది కదా!! ఇదిలా ఉంటే… ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ‘జై భీమ్’ సినిమాలో ప్రకాశ్ రాజ్ తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోలేదు. మరి దానికి కూడా ఈ గొంతు సమస్యే కారణమేమో తెలియదు.
