Site icon NTV Telugu

Prakash Raj: మా ప్రెసిడెంట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్.. ఏం చేసాడు.. అంతా సున్నా అంటూ

Prakash

Prakash

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ భాషలోనైనా ఆయన గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఎన్నో ఏళ్లుగా ప్రకాష్ రాజ్.. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. ట్విట్టర్ వేదికగా బీజేపీ పై దుమ్మెత్తిపోయడం.. ప్రకాష్ రాజ్ కు అలవాటుగా మారిపోయింది. ఇక రెండేళ్ల క్రితం మా ఎన్నికల్లో నిలబడి.. మంచు విష్ణు చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. చిరంజీవి, నాగబాబు లాంటి వారి సపోర్ట్ ఉన్నా కూడా.. మా ప్రెసిడెంట్ కాలేకపోయాడు. ఇక మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాక.. గెలుపు ఓటములు సాధారణమే అని.. కానీ, మా ప్రెసిడెంట్ కనుక చెప్పిన హామీలు నెరవేర్చకపోతే అడిగే హక్కు తమకు ఉందని.. ఏరోజైనా నిలదీస్తామని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ప్రకాష్ రాజ్ చెప్పినట్లుగానే.. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు పై ఫైర్ అయ్యాడు. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యి రెండుళ్లు అవుతుంది. కానీ, ఆయన పనితీరు సున్నా అని చెప్పుకొచ్చాడు.

Nandamuri Balakrishna: హనుమాన్ డైరెక్టర్ తో బాలయ్య.. కాంబో కుదిరితే.. ఫ్యాన్స్ కు పూనకాలే ?

తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..”రెండేళ్లు అయిపోయాయి, కనీసం ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదు, అలాగే మా కి సొంత భవనం కూడా లేదు, విష్ణుని ఎన్నుకున్న సభ్యులు అందరూ ఇప్పుడు ఆలోచించాలి. బోగస్ ఓట్లు, అలాగే బయటి నుంచి వచ్చిన చాలామంది ఓట్లు వేయడం వల్ల అతను గెలిచాడు. మంచు విష్ణు ఈ రెండేళ్లలో చేసింది ఏమీ లేదు.. సున్నా” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆయన వ్యాఖ్యలను పలువు ఏకీభవిస్తుండగా.. మరికొందరు ఖండిస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై మంచు విష్ణు ఎలా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version