NTV Telugu Site icon

Prakash Raj: పవన్ ను ఇంకా వదలని ప్రకాష్ రాజ్.. పంగనామాలంటూ మరో ట్వీట్

Pawan Kalyan Vs Prakash Raj

Pawan Kalyan Vs Prakash Raj

Prakash Raj Again Targets Pawan Kalyan with Latest Tweet: తిరుమల లడ్డు వివాదం మీద ఒకపక్క పొలిటికల్ లీడర్లు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటుంటే ఈ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ పట్టించుకోనున్నా ప్రకాష్ రాజ్ మాత్రం ఏదో ఒకరకంగా పదే పదే పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులను రెచ్చెగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ ‘‘కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking’’ అంటూ ట్వీట్ చేశారు.

Devara Success Meet: ఎటూ తేల్చుకోలేకపోతున్న ‘దేవర’?

ఇక అంతకు ముందు ‘‘దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి 🙏🏿🙏🏿🙏🏿 జస్ట్ ఆస్కింగ్. #justasking #justpleading’’ అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు. అంతేకాదు అంతకు ముందు ‘‘మనకేం కావాలి… ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా..‌పరిపాలనా సంబంధమైన..‌అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్ #justasking’’ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. లడ్డు వివాదాన్ని పవన్ కళ్యాణ్ పెద్దది చేసి మాట్లాడుతున్నారని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మీద ఫైర్ కూడా అవగా ప్రకాష్ రాజ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం గమనార్హం.

Show comments