Site icon NTV Telugu

Prajwal Devaraj: టాలీవుడ్ కి మరో కన్నడ హీరో.. ‘కరావళి’ అంటూ వచ్చేస్తున్నాడు!

Karavali

Karavali

Prajwal Devaraj Karavali First Look Poster Released: ప్రముఖ కన్నడ హీరో అక్కడ డైనమిక్ ప్రిన్స్ అని పేరు తెచ్చుకున్న ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తున్నాడు. ‘అంబి నింగే వయసైతో’ తో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు గురుదత్త గనిగ వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గనిగ ఫిల్మ్స్‌ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. కరావళి అనే గ్రామంలో కంబాల అనే ఆట చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఇక ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ఈ 40వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ప్రోమోలను ఈరోజుకి విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్‌లో ప్రజ్వల్ దేవరాజ్ ఇది వరకెన్నడూ కనిపించని లుక్కులో కనిపిస్తుండగా మహిష అవతారం అన్నట్టుగా అలా మహిషం మీద కదిలి వచ్చే సీన్ అయితే చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే అన్నట్టు ఉంది.

Breaking: కన్నప్ప షూటింగ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ కు గాయాలు.. షూట్ నిలిపివేత!

ఓ వైపు గేదె ప్రసవం, మరో వైపు హీరో జననం చూపిస్తుండడంతో ఈ రెండింటికి ఏదో లింక్ ఉన్నట్టుగా చూపించడం.. చివరకు హీరో కాస్తా మహిషాసురుడు అయ్యాడన్నట్టుగా వెరైటీ గెటప్‌లో కనిపించే షాట్ సినిమా మీద ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా కేవలం కన్నడ, తెలుగు బాషలలోనే కాదు చూస్తుంటే పాన్ ఇండియా సైతం పర్‌ఫెక్ట్ సబ్జెక్ట్ అన్నట్టుగా కనిపిస్తోంది. విజువల్స్, ఆర్ఆర్ కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయని చెబుతున్నారు మేకర్స్. మా భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, మా మూలల్లోంచి కథలు తీసుకుని తెరపై ఆవిష్కరించాలని అనుకుంటున్నామని దర్శక నిర్మాత గురుదత్త గనిగ ఈ సంధర్భంగా తెలిపారు. ఇక ఈ సినిమాకి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. అభిమన్యు సదానందన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ చిత్రం థియేటర్లోకి రానుందని మేకర్స్ వెల్లడించారు.

Exit mobile version