NTV Telugu Site icon

Pragathi: నేను అందగత్తెను.. రజినీ, కమల్ తోనే నటిస్తాను.. వీడితో చేయను

Pragathi

Pragathi

Pragathi: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకున్న నటీమణుల్లో ప్రగతి ఒకరు. స్టార్ హీరోలకు అత్త,అమ్మ పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక సినిమాలో ఎంత సాఫ్ట్ గా ఉంటుందో రియల్ లైఫ్ కలో అంత రఫ్ గా ఉంటుంది ప్రగతి.. సోషల్ మీడియాలో ఆమె యమా యాక్టివ్.. నిత్యం జిమ్ వీడియోలతో పిచ్చెక్కించే ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఈ మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ప్రగతి తాజాగా మరో ఇంటర్వ్యూలో కనిపించింది. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

ఇక ప్రగతి మొదట్లో హీరోయిన్ గా కూడా నటించింది.. కానీ చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే ఆమె కనిపించింది. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో ప్రస్తావించగా షాకింగ్ ఆన్సర్ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. మీరు హీరోయిన్ గా ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేదు అంటే.. రజనీకాంత్, కమల్ హాసన్ అయితేనే హీరోయిన్‌గా చేస్తాను .. వీడితో నేను చేయను అని డైరెక్టర్ తోనే చెప్పేసానని చెప్పుకొచ్చింది. ఇక హీరోలకు మదర్ గా చేస్తూ గ్లామర్ గా పోటీ పడుతున్నారు అన్న ప్రశ్నకు.. ఎలా ఉన్నా నేను అందగత్తెనే.. నాకు సినిమాలు వస్తాయ్.. అందమే ఒకవేళ ఫ్యాక్టర్ అయితే అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఫుల్ ఇంటర్వ్యూ లో ఆమె ఇంకెన్ని ఆసక్తి విషయాలు చెప్తుందో చూడాలి.

Show comments