‘లవ్ టుడే’ వంటి సినిమాలతో తెలుగులో కూడా గుర్తింపు సంపాదించిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా ‘డ్యూడ్’ అనే సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి కీర్తిశ్వరం అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ సంపాదించిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు ఈ సినిమా బుకింగ్స్ భారీగానే నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 83 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా.
Also Read :K Ramp Producer: మా మీద బ్రతికే నా కొ*కా, లుచ్చా నా కొ*కా…ఉరి తియ్యాలి నిన్ను
ఈ సినిమాని తమిళంలో రూపొందించి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఓవరాల్ కలెక్షన్స్లో తెలుగు నుంచి కూడా గట్టిగానే కలెక్షన్స్ వస్తున్నాయని యూనిట్ చెబుతోంది కానీ, ఎక్కడ ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనే విషయం మీద అధికారికంగా ప్రకటన ఇప్పటివరకు అయితే లేదు. మమిత బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌కి మాత్రం ఒక బ్లాక్ బస్టర్ ప్రాజెక్టుగా నిలిచిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే, రూ. 27 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని మైత్రీ మూవీ మేకర్స్‌కి లాభాల పంట పండిస్తోంది.
