Dude 2: భాషతో పని లేకుండా.. నటుడితో సంబంధం లేకుండా సినిమాలో కంటెంట్ ఉంటే హిట్ చేసే మంచి లక్షణం తెలుగు సినీ అభిమానుల సొంతం. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే లేని ఒక తమిళ హీరో తన డబ్బింగ్ సినిమాతోనే టాలీవుడ్‌లో ప్రత్యేకమైన మార్కెట్‌ను సృష్టించుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు.. కంటెంట్ ఉంటే సినిమా పక్కా హిట్ అవుతుందని. తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ టుడే సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు . తర్వాత ఆయన చేసిన ‘డ్రాగన్’ కూడా తెలుగులో మంచిగానే ఆడింది. దీంతో ఆయన తన నెక్ట్స్ సినిమా తెలుగులో టాప్ ప్రొడక్షన్ హౌజ్‌లలో ఒకటి అయిన మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరే ‘డ్యూడ్’. కీర్తిస్వరన్ అనే ఒక డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమా తెరకెక్కించారు. యంగ్ సెన్సేషన్ మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోందో తెలుసిందే. అప్పటి నుంచి ఈ సినిమా సిక్వెల్ వస్తుందా రాదా అనే డైలమాలో ఫ్యాన్స్ పడ్డారు.
తాజాగా ‘డ్యూడ్’ (Dude) సీక్వెల్‌పై సినిమా డైరెక్టర్ కీర్తిస్వరన్ అఫీషియల్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన ఈ సినిమాపై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కీర్తీశ్వరన్ మాట్లాడుతూ.. ‘డ్యూడ్ 2’ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “ఇటీవల నేను పీఆర్ (ప్రదీప్ రంగనాథ్) బ్రోతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఒక క్రేజీ ఐడియాను చెప్పాను. ఆ ఐడియా వినగానే ‘డ్యూడ్’ సినిమాకు ఉన్న ఒరిజినల్ స్పిరిట్, వైబ్స్ ఇందులో పక్కాగా ఉన్నట్లు మాకు అనిపించింది” అని డైరెక్టర్ వెల్లడించారు. ఆ ఐడియా గనుక అనుకున్నట్లుగా వర్కవుట్ అయితే.. కచ్చితంగా దానిని మేము ‘డ్యూడ్ 2’ గానే తెరకెక్కిస్తామని కీర్తీశ్వరన్ స్పష్టం చేశారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కు పక్కా కంటిన్యూషన్ స్టోరీతోనే డ్యూడ్ 2 రాబోతోందని ఆయన లీక్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా .. ఇప్పుడు ‘డ్యూడ్ 2’ గా సరికొత్తగా రాబోతుండటంతో ఈ సినిమా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

