తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్, ప్రస్తుతం సౌత్‌లో యంగ్ సెన్సేషన్‌గా మారారు. ‘లవ్ టుడే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసి, తన సహజమైన నటన, అద్భుతమైన హాస్య టైమింగ్‌తో స్టార్ రేంజ్‌ను అందుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా కూడా తన ప్రతిభను చాటిన ప్రదీప్, ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
Also Read : Priya Marathe : ప్రముఖ నటి కన్నుమూత..
ఇక తాజాగా ఆయన నటిస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి మంచి స్పందన పొందుతోంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్లలో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నయనతార, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రదీప్ రంగనాథన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ..
‘జీవితంలో ఒకసారి అయినా ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్, నటుడు, దర్శకుడు జాకీ చాన్‌తో సినిమా చేయాలనేది నా కల. ఆ అవకాశం వస్తే కనుక ఆ చిత్రానికి నేనే దర్శకత్వం వహించి, జాకీ చాన్ లీడ్ రోల్‌లో నటిస్తా’ అని వెల్లడించారు. ఇక ప్రదీప్ రంగనాథన్ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పడం ఆయన అభిమానుల్లో పెద్ద ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది. ఒకవేళ భవిష్యత్తులో ఈ కల నిజమైతే, అది భారతీయ సినిమా చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
