Site icon NTV Telugu

Prabhudeva: ప్రభుదేవా నిర్వాకానికి మూర్ఛ పోయిన పిల్లలు?

Prabhudeva

Prabhudeva

Prabhudeva Skips a World Record Event Children fainted in Extreme Sun: సుందరం మాస్టర్ కుమారుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ప్రభుదేవా తమిళ సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ అయి తరువాత నటుడు, దర్శకుడు కూడా అయ్యాడు. ఇప్పుడు విజయ్ 68వ సినిమాకి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే వరల్డ్ రికార్డ్ ఈవెంట్ ‘100 నిమిషాల 100 ప్రభుదేవా సాంగ్స్’ను చెన్నైలో నిర్వహించాలని భావించారు. అయితే దానికి ప్రభుదేవా హాజరవుతాడని భావించారు. అయితే చివరి నిమిషంలో ప్రభుదేవా ఈవెంట్‌లో పాల్గొనకపోవడంతో ఎండలో నిలబడిన తల్లిదండ్రులు, వారి పిల్లలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంతమంది మూర్ఛబోయినట్టు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక ఈ ఈ విషయంలో ప్రభుదేవా వారికి క్షమాపణలు చెప్పారు. నిజానికి అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా, చెన్నైలోని రాజరత్నం మైదానంలో ప్రభుదేవా ఎంపిక చేసిన 100 పాటలకు 100 నిమిషాల డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు.

Shyam Rangeela: మోడీపై కమెడియన్ పోటీ?

పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా 5000 వేల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుదేవా ప్రత్యేక అతిథిగా హాజరవుతారని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని కొరియోగ్రాఫర్ రాబర్ట్ మాస్టర్ తన సిబ్బందితో కలిసి నిర్వహించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ప్రభుదేవా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే అయన కోసమే వచ్చి ఉదయం నుంచి ఎండలోనే బారులు తీరిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు కార్యక్రమ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ముందుగా చెప్పిన సమాచారం మేరకు ఎండ రాకుండా ఉదయం 6 గంటలకు మొదలు పెట్టి 7.30కి ముగిస్తారని అనుకున్నారు. అయితే ప్రభుదేవా 9 గంటల వరకు రాలేదని, ఎండ తీవ్రత పెరిగి కొంతమంది పిల్లలు కళ్ళు తిరిగి కూడా పడిపోయారని తల్లిదండ్రులు ఆరోపించారు.

Exit mobile version