NTV Telugu Site icon

Prabhudeva: 50 ఏళ్ళ వయస్సులో మూడోసారి తండ్రి అయిన ఇండియన్ మైకేల్ జాక్సన్..?

Prabhudeva

Prabhudeva

Prabhudeva: ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవాగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డ్యాన్స్ చేస్తే.. అస్సలు బాడీలో ఎముకలు ఉన్నాయా అన్న అనుమానం ఎవరికైన వస్తుంది. హీరోగా, డైరెక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న ప్రభుదేవా గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది. అదేంటంటే.. ప్రభుదేవా ముచ్చటగా మూడోసారి తండ్రి అయ్యినట్లు తెలుస్తోంది. ప్రభుదేవా మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు. ఆయన జీవితంలోకి నయన్ అడుగుపెట్టిన తరువాత ప్రభుదేవాకు.. ఆయన భార్యకు విబేధాలు తలెత్తడం.. వారు విడిపోవడం జరిగాయి. ఇక మొదటి భార్యతో విడిపోయాక కొన్నాళ్ళు సింగిల్ గా ఉన్న ప్రభు.. మూడేళ్ళ క్రితం పిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్ ను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ మధ్యనే ఈ రహస్య వివాహం బయటపడింది.

Mrunal thakur : తన పారితోషకం విలువ చెప్పి నిర్మాతలను భయపెడుతున్న మృణాల్…?

ప్రభుదేవా పుట్టినరోజున ఆమె ఒక ఛానెల్ వీడియోలో భర్తకు బర్త్ డే విషెస్ తెలిపింది. ప్రభుదేవా దొరకడం తన అదృష్టమని చెప్పగా.. ఆయన కూడా తన భార్య తన తల్లిలా చూసుకొంటుందని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభుదేవా- హిమానీ సింగ్ కు ఆడపిల్ల జన్మించిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇక ఈ విషయాన్ని కూడా ప్రభుదేవా చాలా సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నట్లు సమాచారం. ఇక సుందరం మాస్టర్ ఇంటికి కొత్త అతిథి రావడంతో సంబురాలు అంబరాన్ని అంటినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ప్రభుదేవా వయస్సు 50.. హాఫ్ సెంచరీకి నీకు మంచి గిఫ్ట్ వచ్చింది అన్నా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ విషయమై ప్రభుదేవా ఎలా స్పందిస్తాడో చూడాలి.

Show comments