Site icon NTV Telugu

Prabhas: దీపికాకు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రభాస్..

Prabhas

Prabhas

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి పరిచయం కూడా చేయాల్సిన అవసరం లేదు. గతేడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. దాదాపు ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి కల్కి2898 AD. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది. నేడు దీపికా పుట్టినరోజు. దీంతో కల్కి టీమ్ ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెష్ తెలిపారు. ఇక ప్రభాస్ కు దీపికాకు స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

ప్రభాస్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు అన్న విషయం తెల్సిందే. కానీ, తనతో కలిసిపనిచేసిన వారి పుట్టినరోజులను గుర్తుపెట్టుకొని విష్ చేస్తూ ఉంటాడు. దీపికా ఫోటోను షేర్ చేస్తూ.. “అత్యంత అందమైన నటి దీపికా పదుకొనేకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీలాగే ఈ ఏడాది మరింత అందంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి కల్కి సినిమాతో దీపికా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version