యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” బెనిఫిట్ షోలు తెలంగాణాలో ప్రదర్శితం అయ్యాయి. అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన పూజాహెగ్డేకు, ప్రభాస్ కు మధ్య సినిమా షూటింగ్ సమయంలో విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని “రాధేశ్యామ్” ప్రమోషన్లలో పూజాహెగ్డే వెల్లడించింది. అయితే ప్రభాస్ మాత్రం ప్రెస్ మీట్‌లలో పూజా హెగ్డేతో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వకపోవడం చూసి విబేధాలు ఉన్నాయని ఫిక్స్ అయ్యారు అంతా. ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్ 1 హీరోయిన్‌గా ఉన్న డస్కీ సైరన్ పూజాహెగ్డే… ప్రభాస్ గురించి చాలా మాట్లాడుతున్నప్పటికీ, ఆయన మాత్రం ఎక్కడా ఆమె గురించి మాట్లాడడం లేదు.
Read Also : Clap Movie Review : సిన్సియర్ అటెమ్ట్!
ఇక తాజాగా “రాధే శ్యామ్”ని ప్రమోట్ చేయడానికి రాజమౌళి ప్రభాస్‌తో కలిసి చేసిన స్పెషల్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే గురించి టాక్ వస్తుందని చాలా మంది ఆశించారు. అయితే ప్రధాన జంట మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని, వారిపై ప్రేమను చిత్రీకరించిన విధానం చాలా అద్భుతంగా ఉందని రాజమౌళి పేర్కొన్నప్పటికీ, ప్రభాస్ పెద్దగా స్పందించలేదు. దర్శకుడు రాధా కృష్ణకు క్రెడిట్ ఇచ్చాడు. కానీ పూజా హెగ్డే గురించి ఒక్క మాట కూడా మాట్లాడపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
