పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల విడుదలైన తన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’ చిత్రానికి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభాస్ స్పెయిన్ వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఆయన వెకేషన్ కోసం అక్కడికి వెళ్లారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు షాక్ ఇచ్చేలా మరో ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ఆరోగ్యం బాలేకపోవడంతో స్పెయిన్ లో చికిత్స పొందుతున్నాడని సమాచారం. గత కొంతకాలం నుంచి ప్రభాస్ వరుసగా సినిమా షూటింగులలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ ఖాతాలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న “సలార్” కూడా ఉంది.
Read Also : RRR in Dubai : రోరింగ్ రెస్పాన్స్… వీడియో వైరల్
అయితే కొన్ని రోజుల క్రితం ప్రభాస్ ‘సలార్’ షూటింగ్ సమయంలో గాయపడ్డాడట. గాయానికి చికిత్స కొనసాగుతుండగా, ఆయన బార్సిలోనాలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. చిన్నపాటి ఆపరేషన్ అయినప్పటికీ, డాక్టర్ తదుపరి చెకప్ వరకు ప్రభాస్ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని చెప్పారట. ప్రభాస్ సర్జరీ గురించి తెలుసుకున్న ఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభాస్ కిట్టీలో ఇప్పుడు బహుభాషా పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్-కే’, ‘స్పిరిట్’తో పాటు దర్శకుడు మారుతీతో మరో చిత్రంలో కనిపించనున్నారు.
