Prabhas – Trivikram: టాలీవుడ్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరి కలయికలో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే తాజాగా త్రివిక్రమ్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చూస్తుంటే.. భవిష్యత్తులో ప్రభాస్‌తో ప్రాజెక్ట్ చేసేందుకు ఆయన ఇప్పటికే మైండ్‌లో ఓ పక్కా స్కెచ్ వేసుకున్నారా అనే చర్చ మొదలైంది. ప్రభాస్‌తో సినిమా చేసే ఆలోచనపై త్రివిక్రమ్ ఇచ్చిన హింట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ తన ఆలోచనను బయటపెట్టారు. “ప్రభాస్‌లో చాలా భిన్నమైన కామెడీ సెన్స్ ఉంది. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా ఆయనలోని ఆ హ్యూమర్ యాంగిల్‌ను పూర్తిగా వాడుకోలేదు. ఒకవేళ నేను కనుక ప్రభాస్‌తో సినిమా చేయాల్సి వస్తే.. అదిరిపోయే యాక్షన్, మంచి ఎమోషన్స్ ఉంటూనే, ప్రభాస్ మార్క్ హ్యూమర్‌ను మిక్స్ చేసి ఓ క్రేజీ సినిమా తీస్తా” అంటూ డైరెక్ట్‌గానే చెప్పారు. ప్రభాస్‌లో ఏ దర్శకుడూ టచ్ చేయని పాయింట్ ఏంటో చెప్పడంతో పాటు, తాను సినిమా తీస్తే కథ ఏ రూట్లో ఉంటుందో కూడా త్రివిక్రమ్ స్పష్టంగా వివరించడంతో.. త్వరలోనే ఈ కాంబో అనౌన్స్మెంట్ ఉండబోతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ అన్నీ భారీ యాక్షన్, గన్స్, కత్తులతో కూడిన సీరియస్ రోల్సే చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్గా రాజాసాబ్ సినిమా వచ్చిన కానీ ‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ రోజుల్లో ప్రభాస్ చేసిన అల్లరి, ఆయన కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయలేకపోయిందనే కామెంట్స్ ఉన్నాయి. ఆ పాత వింటేజ్ ప్రభాస్‌ను చాలాకాలంగా ఫ్యాన్స్ మిస్ అవుతున్న ఫ్యాన్స్‌కు త్రివిక్రమ్ మాటలు ఫుల్ కిక్కిస్తున్నాయి. త్రివిక్రమ్ రాసే పంచ్ డైలాగులు, చమత్కారం.. దానికి ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, ఈజ్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర మరో చరిత్ర సృష్టించడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి ఈ లైనప్ పూర్తయ్యాక, త్రివిక్రమ్ ఇచ్చిన హింట్ నిజమై ఈ కాంబినేషన్ పట్టాలెక్కుతుందో చూడాలి.

