Prabhas Took Break From Shootings Due To Leg Pain: రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ సినిమాల చిత్రీకరణల్లో బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా.. సలార్‌లో భారీ యాక్షన్ సన్నివేశాల కోసం అతను తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌కి గాయమైంది. దాని కోసం అతడు మూడు నెలల క్రితమే యూరప్ వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. అక్కడినుంచి తిరిగొచ్చిన తర్వాత మళ్లీ షూట్‌లో పాల్గొన్న ప్రభాస్‌కి మళ్లీ మోకాలి గాయం తిరగతోడిందట! దీంతో షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి మరోసారి యూరప్‌కి వెళ్లగా.. గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు, పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట!
నిజానికి.. ‘బాహుబలి’ చిత్రీకరణ సమయంలోనే ప్రభాస్‌కి గాయమైంది. అది ఇప్పటి పెడుతున్నప్పటికీ, ఖాతరు చేయకుండా ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ.. ‘సలార్’ సినిమా కోసం ఎక్కువ కష్టపడాల్సి రావడంతో, ఆ గాయం ఇప్పుడు ప్రభావం చూపుతోందని తెలిసింది. దానికి సర్జరీ చేయాల్సిందేనని డాక్టర్లు చెప్పడంతో, ప్రభాస్ యూరప్ వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇటీవల మళ్లీ ఇబ్బంది పెట్టడంతో, పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోమన్ని డాక్టర్లు చెప్పారు. తద్వారా.. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ చిత్రీకరణలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. పూర్తిగా కోలుకున్న తర్వాత.. ఆ రెండు సినిమాల చిత్రీకరణల్ని పునఃప్రారంభించనున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్.. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
కాగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న ‘సలార్’ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ప్రాజెక్ట్ కే’లో అమితాభ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. సై-ఫై జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడు.
