The Rajasab : ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. జనవరి 9న ఈ సినిమా రాబోతోంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను హర్రర్ కామెడీ కోణంలో తీసుకొస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో పెద్ద యాక్షన్ సీన్లు, ఒళ్లు హూనం అయిపోయే స్టంట్లు ఏమీ లేవు కాబట్టి.. ప్రభాస్ ఆడుతూ పాడుతూ షూటింగ్ చేస్తున్నాడంట. ఈ క్రమంలోనే ఈ మూవీలో డ్యాన్స్ చేయడానికి డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.
Read Also : Hansika : హన్సికకు కోర్టులో షాక్.. ఇలా జరిగిందేంటి..
అందుకే మూవీ టైటిల్ సాంగ్ కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ను తీసుకున్నారంట. ప్రస్తుతం సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ సాంగ్ లో బాగానే స్టెప్పులు వేస్తున్నాడంట ప్రభాస్. గతంలో ఏ సినిమాలో లేనంతగా ఈ సాంగ్ లో ఫాస్ట్ బీట్ స్టెప్పులు వేయబోతున్నాడంట ప్రభాస్. ఆ విషయాన్ని సర్ ప్రైజ్ గా ఉంచి మూవీలో చూపించి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నారంట. ప్రభాస్ అదిరిపోయే డ్యాన్స్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి అది కాస్త ది రాజాసాబ్ తో తీరిపోనుందన్నమాట. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
Read Also : Devan : ఐస్ క్రీమ్ తిని చనిపోయిన నటుడి భార్య..
