NTV Telugu Site icon

Kannappa: రంగంలోకి ప్రభాస్… పరమశివుడు ఆగమనానికి సర్వం సిద్ధం

Prabhas

Prabhas

గతంలో ఓసారి హిందీ సినిమాలో క్యామియో ఇచ్చాడు ప్రభాస్. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన సినిమా సమయంలో సాంగ్ లో జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోయిన అప్పటి ప్రభాస్ కి పాన్ ఇండియా బాక్సాఫీస్ కి సోలో కింగ్ గా నిలిచిన ఇప్పటి ప్రభాస్ కి చాలా తేడా ఉంది. బాహుబలి పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్ గా మారిన ప్రభాస్ కి… నార్త్‌లో ప్రభాస్‌ గుడికట్టే రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఏకంగా ఖాన్ త్రయాన్ని సైతం వెనక్కి నెట్టి… బాలీవుడ్ హీరోలకు వణుకు పుట్టిస్తున్నాడు ప్రభాస్. రెబల్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే చాలు… ఎంత పెద్ద హీరో అయిన సరే వెనకడుగు వేయాల్సిందేనని.. రీసెంట్‌గా సలార్ వర్సెస్ డంకీ వార్ ప్రూవ్ చేసింది. అలాంటి ప్రభాస్ క్యామియే చేస్తున్నాడు అంటే, ఆ సినిమా పై హైప్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మంచు విష్ణు భారీ బడ్జెట్‌తో క‌న్న‌ప్ప‌ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‌లో మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా… భారీ స్టార్ క్యాస్టింగ్‌తో రాబోతోంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌తో పాటు ప్రభాస్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. శివుడిగా కనిపించబోతున్నాడు ప్రభాస్. పార్వతి పాత్రలో నయనతార నటించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే శివపార్వతికి సంబంధించిన పార్ట్‌ని షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ప్రభాస్ ఒక మూడు రోజుల కాల్ షీట్స్‌ని ఇచ్చాడట. ఫిబ్రవరి థర్డ్ వీక్‌లో ప్రభాస్ కన్నప్ప సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ శివుడి పాత్ర రివీల్ అవుతుందని… సినిమా మొత్తానికే ఈ ఎపిసోడ్ మెయిన్ హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణుకి జంటగా ప్రీతీ ముఖుంధన్ హీరోయిన్‌గా నటిస్తుండగా… బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు.