Site icon NTV Telugu

Prabhas: కాటేరమ్మ కొడుకు వస్తున్నాడా?

Prabhas

Prabhas

సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. అయినా కూడా ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు.. ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవలేదు. ప్రమోషన్స్ కోసం రాకపోయినా… కనీసం సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ అయినా ఉంటాయనుకుంటే… అది కూడా లేదు. అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది సలార్. ఇప్పటికే 650 కోట్ల గ్రాస్ మార్క్‌ క్రాస్ చేసి 700 కోట్ల వైపు దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో సలార్ కలెక్షన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నైజాంలో సలార్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేశారు.

Read Also: Saindhav: ఒక్క ట్రైలర్ లోనే ఇంతమందిని చంపేశావ్ ఏంటి వెంకీ మామా?

సలార్‌ సక్సెస్ జోష్‌లో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్… సంక్రాంతికి హనుమాన్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ వైబ్‌తో జనవరి 12న థియేటర్లో రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్… జనవరి 7న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు రెబల్​ స్టార్ ప్రభాస్​ గెస్ట్‌గా రానున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ప్రభాస్ గనుక హనుమాన్ ఈవెంట్‌కు వస్తే… ఆటోమేటిక్‌గా సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోతాయి. అయితే మరో వెర్షన్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్‌గా గెస్ట్‌గా వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. రేపో మాపో ఈ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరి హనుమాన్ కోసం మెగాస్టార్ వస్తాడా? ఆదిపురుష్‌ వస్తాడా? అనేది చూడాలి.

Exit mobile version