Prabhas : మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. హీరోలుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. వీరిద్దరికీ చాలా కాలంగా హిట్లు లేవు. ఇలాంటి టైమ్ లో ఇద్దరూ ఒకే ఏడాది హిట్లు కొట్టారు. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సపోర్ట్ తోనే. కన్నప్ప సినిమా భారీ బడ్జెట్ తో వచ్చింది. ఆ మూవీకి ముందు మంచు విష్ణు మార్కెట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్ర చేశాడు. ఆ పాత్రతోనే మూవీకి భారీ క్రేజ్ వచ్చింది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేయడంతో అంతో ఇంతో కలెక్షన్లు వచ్చాయి. మూవీకి పాజిటివ్ టాక్ సొంతం అయింది. ఇప్పుడు మనోజ్ సినిమాకు అలాగే అండగా నిలబడ్డడాడు ప్రభాస్.
Read Also : Samantha : అవన్నీ శాశ్వతం కాదు.. రిలేషన్ పై సమంత షాకింగ్ కామెంట్
తేజసజ్జా హీరోగా మనోజ్ విలన్ గా చేసిన మిరాయ్ సినిమా నిన్న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో మనోజ్ మళ్లీ క్రేజ్ దక్కించుకున్నాడు. ప్రభాస్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడాన్ని సీక్రెట్ గా ఉంచారు. రిలీజ్ కు గంట ముందు ఈ విషయాన్ని చెప్పి సర్ ప్రైజ్ చేశారు. ప్రభాస్ వాయిస్ ఓవర్ తో మూవీ థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు సినిమాను. మనోజ్ చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇందులోనూ ప్రభాస్ సపోర్ట్ ఉందన్నమాట. ఇలా అన్న దమ్ములిద్దరికీ చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ సెంటిమెంట్ తో హిట్లు దక్కాయన్నమాట. తనకు ఏ మాత్రం అవసరం లేకపోయినా ఇలా మంచు బ్రదర్స్ కు అండగా నిలబడ్డాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ ను మంచు ఫ్యామిలీ ప్రశంసల్లో ముంచెత్తుతోంది.
Read Also : Teja Sajja : ప్రభాస్ ది గోల్డెన్ హార్ట్.. అడగ్గానే సాయం చేస్తాడు..
