NTV Telugu Site icon

Salaar: ప్రభాస్ పక్కన మరో కన్నడ స్టార్ హీరోని రంగంలోకి దించిన ప్రశాంత్ నీల్…

Salaar

Salaar

ప్రశాంత్ నీల్-ప్రభాస్ ల ఫైర్ హౌజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘సలార్’. మరో మూడు నెలల్లో ఆడియన్స్ ముందుకి రానున్న సలార్ సినిమా డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కింది. హాలీవుడ్ సినిమాలకి మాత్రమే ఈ థీమ్ ని వాడారు, అలాంటిది ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామా సినిమాకి డార్క్ థీమ్ ని పెట్టి ప్రశాంత్ నీల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా సలార్ సినిమా ఒక్కటి చాలు, అది బయటకి వస్తే ఇండియాలో ఏ రికార్డ్ మిగలదు అని ప్రతి ఒక్కరూ నమ్ముతున్న సినిమా ‘సలార్’ మాత్రమే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ప్రభాస్ కి విలన్ గా పృథ్వీ కనిపించనున్నాడు, పృథ్వీరాజ్ రావడంతో సలార్ సినిమాకి మలయాళంలో సాలిడ్ రీచ్ వచ్చేసింది.

లేటెస్ట్ గా సలార్ సినిమాలో ఒక కన్నడ స్టార్ హీరోని కూడా ప్రశాంత్ నీల్ రంగంలోకి దించుతున్నాడని సమాచారం. కన్నడ హీరో అనగానే యష్ అనుకుంటారు కానీ సలార్ లో యంగ్ స్టార్ హీరో రక్షిత్ శెట్టిని ప్రశాంత్ నీల్ కాస్ట్-ఇన్ చేసాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఈ విషయాన్ని రూమర్ గానే చూడాలి కానీ నిజంగానే రక్షిత్ శెట్టి సలార్ లో నటిస్తున్నట్లైతే కన్నడ మార్కెట్ లో మరిన్నీ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే సలార్ టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అవుతున్నారనే మాట గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఇన్ని రోజులు ఆదిపురుష్ కోసం వెయిట్ చేసిన ప్రశాంత్ నీల్ అండ్ టీమ్… ఇప్పుడు ఆ అడ్డు కూడా తొలగిపోవడంతో సలార్ రేంజ్ ఏంటో టీజర్ తోనే చూపించడానికి రెడీ అయ్యాడు. మరి టీజర్ ని ప్రశాంత్ నీల్ ఏ రేంజులో కట్ చేసాడో చూడాలి.

Show comments