Site icon NTV Telugu

Salaar: రారాజు తిరిగొస్తున్నాడు… పట్టాభిషేకం మొదలుపెట్టండి

Salaar

Salaar

ప్రభాస్ రాముడిగా వస్తేనే ఇండియన్ బాక్సాఫీస్ దాదాపు 400 కోట్ల కలెక్షన్స్ ని ఇచ్చింది. అదే ఇక రాక్షసుడిగా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాధే శ్యామ్, సాహూ, ఆదిపురుష్… ఇక ప్రయోగాలు అయిపోయాయి, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరో తన ఫెవరెట్ జోన్ లోకి సలార్ సినిమాతో తిరిగొస్తున్నాడు. గెట్ రెడీ డార్లింగ్స్, ఇక రికార్డుల యుద్దానికి సిధ్దమవ్వండి… సలార్ టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ప్రశాంత్ నీల్ తమ హీరోని ఎలా చూపించబోతున్నాడనే ఎగ్జైట్మెంట్‌కు.. తుఫాన్ హెచ్చరిక జారి చేసినట్టుగా ముందుగా టీజర్ రాబోతోంది. ఇప్పటి నుంచి సలార్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టేనని చెప్పొచ్చు. మాస్‌ సినిమాల్లో కొత్త హిస్టీరియా క్రియేట్ చేసేందుకు వస్తోంది సలార్ మూవీ. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు సలార్ నుంచి జస్ట్ కొన్ని లుక్స్ మాత్రమే రిలీజ్ చేశారు. మసి పూసికొని మాస్ జాతరకు రెడీ అవుతున్న ప్రభాస్ కటౌట్, సలార్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఇక సలార్ నుంచి ఒక్క టీజర్ బయటికొస్తే చూడాలని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో సలార్ టీజర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

“బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ ది మోస్ట్ వయొలెంట్ మాన్… #Salaar” అంటూ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. జులై 6న ఉదయం 5:12 నిమిషాలకి మచ్ అవైటెడ్ సలార్ టీజర్ హై ఓల్టేజ్ తో బయటకి బయటికి రాబోతోంది. తెల్లవారుఝామున 5:12 టీజర్ రిలీజ్ అనేది డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చెయ్యడానికి కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అయినా ఇన్ని రోజులు ఎదురు చూసిన ఫాన్స్, ఆ టైమ్ కి పడుకునే పరిస్థితిలో ఉండరు కాబట్టి కొత్త రికార్డ్స్ క్రియేట్ అవ్వడం అయితే గ్యారెంటీ. ఈ టీజర్ అనౌన్స్మెంట్ ఇస్తూ వదిలిన పోస్టర్ లో ప్రభాస్ యాక్షన్ మోడ్ లో ఉన్నాడు. బ్యాక్ షాట్ లో ప్రభాస్ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ తో కనిపిస్తున్నాడు. ఈ ఒక్క పొస్టరే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అంటే సలార్ టీజర్ బయటకి వస్తే ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే 90 సెకన్ల టీజర్ కట్ చేశారని తెలుస్తోంది. రవి బాసూర్ మార్క్ BGM ఓ రేంజ్‌లో ఉంటుందని సమచారాం. దీంతో ఈ 90 సెకన్లకు సోషల్ మీడియా క్రాష్ అయిపోవడం గ్యారెంటీ అంటున్నారు. మరి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు గల్లంతు చెయ్యడానికి పునాదిగా బయటకి రానున్న టీజర్ ఏ రేంజులో ఉండబోతుందో చూడాలి.

Exit mobile version