రెబల్ స్టార్ ప్రభాస్… పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర స్ట్రామ్ ని క్రియేట్ చేయడానికి సలార్ సినిమాతో వస్తున్నాడు. ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్ కూడా కలవడంతో తుఫాన్ కాస్త ఉప్పెనగా మారింది. ఎన్ని రికార్డులు ఉన్నాయో అన్నీ బ్రేక్ చేసే కొత్త చరిత్ర సృష్టించడానికి, డిసెంబర్ 22న దండయాత్రకి సిద్ధమయ్యాడు ప్రభాస్. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న సలార్ హైప్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ట్రైలర్, సూరీడే సాంగ్ రిలీజ్ తో సలార్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ అంచనాల రేంజ్ ఏంటో చూపిస్తున్నాయి సలార్ బుకింగ్స్. సలార్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో బుక్ మై షో అప్లికేషన్ ని ఓపెన్ చేయడంలో బిజీగా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. బుకింగ్స్ ఓపెన్ అవ్వడం, రిలీజ్ కి ఇంకా వారమే ఉండడంతో #SalaarExplosionInAWeek అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
క్లాష్ తో సంబంధం లేకుండా సలార్ సినిమా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ సినిమాగా సలార్ హిస్టరీ క్రియేట్ చేయబోతోందని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. ఇదే జరిగితే ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్న ప్రభాస్ సెన్సేషన్ క్రియేట్ చేసినట్లే. ఇదిలా ఉంటే సలార్ సినిమాకి సరైన ప్రమోషన్స్ చెయ్యట్లేదు అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు కానీ సునామీ వస్తుందని హెచ్చరించినా, హెచ్చరించక పోయినా కూడా అది ముంచెత్తడం గ్యారెంటీ. సో ప్రమోషన్స్ చేసినా చెయ్యకపోయినా సలార్ సినిమా ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం పక్కా, అందులో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు.
