NTV Telugu Site icon

Radha Krishna: ఎట్టకేలకు స్టార్ హీరోని పట్టేసిన ‘రాధే శ్యామ్’ డైరెక్టర్…

Radhakrishna

Radhakrishna

బాహుబలి సిరీస్‌తో వండర్స్ క్రియేట్ చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్‌డమ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా నిలిచాడు ప్రభాస్. అయినా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం యంగ్ డైరెక్టర్స్‌తో రెండు సినిమాలు చేశాడు. సుజీత్‌తో సాహో, రాధాకృష్ణతో రాధే శ్యామ్ సినిమాలు చేశాడు. ఈ ఇద్దరికి కూడా ఇవి రెండో సినిమాలే అయినా ప్రభాస్ నమ్మి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని, అభిమానుల నమ్మకాలని నిలబెట్టుకోవడంలో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ ఫెయిల్ అయ్యారు. భారీ బడ్జట్ తో రూపొందిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. ప్రభాస్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయకపోయినా.. బడ్జెట్ పరంగా భారీ నష్టాలనే మిగిల్చాయి.

దాంతో ఈ యంగ్ డైరెక్టర్స్‌కు నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఇప్పటికే సుజీత్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓజి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేశాడు కానీ రాధకృష్ణ నెక్స్ట్ సినిమా విషయంలోనే క్లారిటీ రావడం లేదు. అయితే ఎట్టకేలకు ఈయన కూడా ఓ స్టార్ హీరోతో సినిమా ఓకే చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు రాధాకృష్ణ స్టోరీ నరేట్ చేసినట్టు సమాచారం. విశాల్‌కు స్టోరీ లైన్ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతోందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అఫిషీయల్ అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాను రాధాకృష్ణ కుమార్ ఇప్పటి వరకూ టచ్ చేయని సరికొత్త జోనర్లో తెరకెక్కించబోతున్నాడని టాక్. మరి ఈసారి రాధా కృష్ణ ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తాడో చూడాలి.

Read Also: Adipurush: కథ మొదలయ్యేది ఇక్కడి నుంచే ఇదిగో ప్రూఫ్…