NTV Telugu Site icon

Prabhas: ‘కల్కి’ సీరియస్ వార్నింగ్!

Prabhas

Prabhas

ప్రస్తుతం బడా బడా మూవీ మేకర్స్‌ను సైతం భయపెడుతున్న సమస్య ‘లీకులు’. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్‌ కూడా లీకులకు బేంబేలెత్తిపోతున్నాడు. స్టార్టింగ్ నుంచి ‘గేమ్ చేంజర్’ సినిమా వరుసగా లీకుల బారిన పడుతోంది. రీసెంట్‌గా ‘జరగండి’ అనే సాంగ్ లీక్ అయి మేకర్స్‌కు షాక్ ఇచ్చింది. అలాగే ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ సినిమాను కూడా లీకులు వదలడం లేదు. ఎవరు చేస్తున్నారు? ఎక్కడి నుంచి లీక్ అవుతుందనే విషయం తెలియక తల పట్టకుంటున్నారు మేకర్స్. రీసెంట్‌గా ‘కల్కి’ నుంచి ఓ పిక్ ఒకటి బయటకొచ్చి వైరల్‌గా మారింది. ‘కల్కి’ మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్‌ చేస్తున్న కంపెనీ నుంచే ఈ లీక్ జరిగినట్లు తెలియడంతో… సదరు వ్యక్తిపై యాక్షన్ తీసుకున్నారు.

నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వారైతే ఏకంగా ఆ వ్యక్తిపై క్రిమినల్ కేసు పెట్టారని, విఎఫ్‌ఎక్స్ కంపెనీపై పరువు నష్టం దావా వేశారని వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు అఫిషీయల్‌గా లీగల్ కాపీ రైట్ నోటీస్ రిలీజ్ చేశారు వైజయంతీ వారు. Legal Copyright Notice :  #VyjayanthiMovies wishes to inform the public that #Kalki2898AD and all its components are protected by copyright laws. Sharing any part of the film, be it scenes, footage or images, is illegal and punishable. Legal action will be taken as needed, with the assistance of Cyber Police.. అంటూ నోట్ రిలీజ్ చేశారు. కల్కి సినిమా నుంచి ఎలాంటీ లీకులు చేసినా.. ఆ ఫోటోలు, ఫుటేజ్‌లను అనధికారికంగా ఎవరైనా షేర్ చేసినా.. కాపీరైట్ చట్టాల ద్వారా యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే… సైబర్ పోలీసుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం… అని సీరియస్‌గా చెప్పుకొచ్చారు. మరి ఇప్పటికైనా కల్కి లీకులు ఆగుతాయేమో చూడాలి.

Show comments