అమెరికాలోని శాన్‌డియాగో కామిక్ కాన్ వేదికపై ప్రాజక్ట్ కె టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ముందు నుంచి వినిపించినట్టుగానే ‘ప్రాజెక్ట్ కె’ అంటే ‘కల్కి 2898 ఏడి’ అని అనౌన్స్ అని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ప్రపంచాన్ని కాపాడే ఆధునిక ‘కల్కి’గా కనిపించనున్నాడు ప్రభాస్. ఇక ఈ గ్లింప్స్‌లో కొన్ని అంశాలు అతి పెద్ద సస్పెన్స్‌గా మారాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తుండగా.. కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. దిశా పటానీ మరో కీ రోల్ ప్లే చేస్తోంది. కానీ గ్లింప్స్‌లో ఈ ఐదు పాత్రల్లో రెండు మిస్ అయ్యాయి. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దీపికా పదుకొనెలను మాత్రమే చూపించాడు. అయితే అనూహ్యంగా తమిళ నటుడు పశుపతి టీజర్‌లో హైలెట్ అయ్యాడు. ఇప్పటి వరకు పశుపతి ప్రాజెక్ట్ కేలో ఉన్నట్టు ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ విలన్‌గా నటిస్తున్న కమల్ హాసన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.
టీజర్లో ఇదే అతి పెద్ద సస్పెన్స్‌గా మారింది. అసలు కమల్ హాసన్ పాత్ర ఏంటనేది ఎగ్జైటింగ్‌గా మారింది. అలాగే దిశా పటాని కూడా టీజర్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈ రెండు క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయనేది సస్పెన్స్‌గా మారింది. అలాగే ప్రాజెక్ట్ కె రెండు భాగాలుగా రాబోతోందనే న్యూస్ బలంగా వినిపిస్తోంది. కానీ గ్లింప్స్‌లో మాత్ర ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. కమల్ హాసన్ పాత్ర రెండో భాగంలో ఎక్కువగా ఉంటుందని చెబుతున్నా.. పార్ట్ 2 అనౌన్స్ చేయకపోవడం కూడా సస్పెన్స్‌గానే మారింది. రిలీజ్ డేట్ విషయంలోను క్లారిటీ ఇవ్వలేదు నాగ్ అశ్విన్. కాబట్టి.. కల్కి టీజర్ వచ్చే వరకు ఈ విషయాలన్ని అతి పెద్ద సస్పెన్స్‌గా మారనున్నాయని చెప్పొచ్చు.