Site icon NTV Telugu

Prabhas: అనౌన్స్మెంట్ లుక్ లోకి వచ్చేసాడు… పార్ట్ 2 మొదలుపెడుతున్నారా?

Prabhas

Prabhas

ప్రభాస్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు… ది రాజాసాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్, కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్, సలార్ సక్సస్ సెలబ్రేషన్స్… ఇలా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వచ్చి రెబల్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. అయితే సలార్ సక్సస్ సెలబ్రేషన్స్ లో ప్రభాస్ కనిపించిన విధానం ఇప్పుడు ఇండియన్ మూవీ లవర్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. ప్రభాస్ స్టైలిష్ గా కనిపించి సక్సస్ పార్టీకి కొత్త వైబ్ తెచ్చాడు. ఈ పార్టీ నుంచి వచ్చిన ప్రభాస్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా కొత్త ఆలోచనలు మొదలయ్యేలా చేసాయి. ప్రభాస్ 2023 డిసెంబర్ నెలలో ఖాన్సార్ ని మాత్రమే కాదు పాన్ ఇండియాని ఎరుపెక్కించాడు. సలార్ సినిమాతో దాదాపు 750 కోట్ల వరకూ కలెక్షన్స్ ని రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. దీంతో సలార్ సినిమా నుంచి పార్ట్ 2 ఎప్పుడు బయటకి వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 1 సీజ్ ఫైర్ ఎండ్ లోనే పార్ట్ 2కి లీడ్ ఇస్తూ ‘శౌర్యంగ పర్వం’ సినిమాకి లీడ్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.

సీజ్ ఫైర్ ఎత్తేసిన తర్వాత ఖాన్సార్ లో ఎలాంటి యుద్ధం జరగబోతుందో చూపిస్తూ శౌర్యంగ పర్వం రూపొందనుంది. ఈ మచ్ అవైటెడ్ సీక్వెల్ కి కావాల్సిన లుక్ లోనే ప్రభాస్ సక్సస్ పార్టీలో కనిపించాడు. సలార్ అనౌన్స్మెంట్ సమయంలో వదిలిన పోస్టర్ లో ప్రభాస్ ఏ లుక్ లో ఉన్నాడో, ఆ లుక్ సీజ్ ఫైర్ లో కనిపించలేదు కానీ పార్ట్ 2లో ఉంటుందని పోస్ట్ క్రెడిట్స్ లో లీడ్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. దీన్ని నిజం చేస్తూ ప్రభాస్ గడ్డం లుక్ లోకి వచ్చేసాడు. కల్కి, ది రాజాసాబ్ సినిమాలు షూటింగ్ జరుగుతుండగా ప్రభాస్ ఇప్పుడు ఈ లుక్ లోకి ఎందుకు వచ్చాడు? అనేది అంతుబట్టని విషయంగా మారింది. ఒకవేళ ప్రశాంత్ నీల్… ప్రభాస్ కలిసి సలార్ 2ని మొదలుపెట్టే ఆలోచన చేస్తున్నారా అనేది చూడాలి. సలార్ 2 ఇప్పుడు స్టార్ట్ అయితే మాత్రం 2025లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే నిజమైతే సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం ఇండియన్ బాక్సాఫీస్ చూసిన బిగ్గెస్ట్ హిట్ గా చరిత్రలో నిలిచిపోతుంది.

Exit mobile version