NTV Telugu Site icon

Prabhas: రెబల్ కాదు ‘రాయల్‌’ ప్రభాస్…

Prabhas America

Prabhas America

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హవా నడుస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఆదిపురుష్’.. అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. ఓ వైపు సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తున్నా.. మిక్స్‌డ్ టాక్ అని అంటున్నా.. జనం మాత్రం ఆదిపురుష్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఫస్ట్ డే 140 కోట్ల గ్రాస్ రాబట్టిన ఆదిపురుష్.. సెకండ్ డే 100 కోట్లు రాబట్టింది. దాంతో.. రోజుకి వంద కోట్లు రాబట్టగల రియల్ పాన్ ఇండియా హీరోగా.. రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు ప్రభాస్. అది కూడా మిక్స్‌డ్ టాక్‌తో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే, ఇక హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ వణుకు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరో వంద రోజుల్లో సలార్ రాబోతోంది. ఈ సినిమా ఇప్పటి వరకున్న రికార్డులన్నింటిని పాతాళానికి తొక్కేయడం గ్యారెంటీ. ఆ తర్వాత సంక్రాంతికి ‘ప్రాజెక్ట్ కె’ రాబోతోంది. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతోంది. ఇక ఆ తర్వాత మారుతి సినిమా రాబోతోంది.

భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మధ్య మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ చేస్తున్నాడు. ఓ ఓల్డ్ థియేటర్ బ్యాక్ డ్రాప్‌లో.. హారర్ కామెడీగా వస్తున్న ఈ సినిమాకు.. నిన్న మొన్నటి వరకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ వినిపించింది కానీ ఇప్పుడు ‘రాయల్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఈ టైటిల్‌ మాత్రం ప్రభాస్ కటౌట్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని… ఇప్పటివరకు రెబల్ స్టార్ ప్రభాస్ ఇకపై ‘రాయల్ ప్రభాస్’ అంటున్నారు అభిమానులు. మరి ఫైనల్‌గా మారుతి, ప్రభాస్ ఎలాంటి టైటిల్‌తో వస్తారో చూడాలి.