NTV Telugu Site icon

Prabhas: అన్నపూర్ణ స్టూడియోలో టెర్రస్ ఎక్కిన పాన్ ఇండియా స్టార్

Prabhas

Prabhas

ఆదిపురుష్, ప్రాజెక్ట్ K, సలార్… పస్తుతం ప్రభాస్ చేస్తున్న భారి బడ్జట్ సినిమాలు. హ్యుజ్ సెటప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మధ్యలో అందరికీ షాక్ ఇస్తూ ప్రభాస్ దర్శకుడు మారుతీతో ఒక సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వ్యతిరేఖత ఉంది. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా ఇచ్చిన మాటని, కమిట్ అయిన సినిమాని వదిలి వెళ్లకుండా ప్రభాస్, మారుతీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు నలబై రోజుల రోజుల షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. మారుతీ స్టైల్ లో కామెడీ టచ్ ఇస్తూ ఉండే హారర్ జోనర్ లో ఈ సినిమా ఉంటుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ ఇప్పటివరకూ అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేదు.

మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ని అనుకుంటున్నారని న్యూస్ వినిపిస్తోంది. ఇంకా ఫిక్స్ చెయ్యలేదు కానీ రాజా డీలక్స్ పాజిటివ్ వైబ్ నే తెచ్చింది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. మేకర్స్ ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో 19వ శతాబ్దపు కాలం నాటి ‘స్పెషల్ హౌజ్ సెట్‌’ వేశారని ఇన్‌సైడ్ టాక్‌. ఇప్పటికే మొదలైన కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణలో విదేశీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ టీమ్స్‌, పలువురు నటీనటులు పాల్గొనబోతున్నారట. దాదాపు పది రోజుల పాటు ఇదే లొకేషన్ లో చిత్ర యూనిట్ ‘హౌజ్, టెర్రస్, ఇంటీరియర్స్’ షూటింగ్ చెయ్యనున్నారు. మరి అందరి అంచనాలని తలకిందులు చేస్తూ మారుతీ, ప్రభాస్ కి పాన్ ఇండియా హిట్ ఇస్తాడేమో చూడాలి.

Show comments